ఆడలేక ఓటిటి మీదకు..

సినిమాలు బాగుంటే జనం శహభాష్ అంటారు. సమీక్షకులు సైతం సూపర్ అంటారు. సినిమా బాగా లేదంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే సినిమాలు తీసిన వారు మాత్రం తమ సినిమాలకు సరైన సమీక్షలు రాకున్నా, మంచి ఫీడ్ బ్యాక్ లేకపోయినా, ఏదో ఒక సాకు వెదికి, సేఫ్ అవ్వాలనుకుంటారు. కరోనా నేపథ్యంలో ఓటిటిలో విడుదలయ్యాయి చాలా సినిమాలు. 

వీటిల్లో కొన్ని బాగున్నాయి. కొన్ని బాగాలేవు. కొన్నింటికి మంచి రేటింగ్ లు వచ్చాయి. కొన్నింటికి రాలేదు. అయితే ఈ విషయంలో ఓ కొత్త వాదన చేస్తున్నారట కొందరు డైరక్టర్లు. తమ సినిమా బాగా లేదని జనం యూనివర్సల్ గా తీర్పుచెప్పేసినా, కింద పడినా మీదే పడ్డాం అనే చందంగా ఈ వాదన సాగిస్తున్నారట.

అదెలా అంటే, సినిమాలు ఓటిటిలో విడుదల కావడం మీడియాకు ఇష్టం లేదు. థియేటర్లో విడుదల అయితేనే బాగుంటుంది అనేది సినిమా మీడియా అభిప్రాయం. అందుకే ఎవ్వరు ఓటిటిలో విడుదల చేసినా సరైన రేటింగ్ లు, సమీక్షలు ఇవ్వడం లేదు అన్నది వారి వాదనట. చిత్రమేమిటంటే ఈ వాదనను తోటి దర్శకుల దగ్గర చేస్తుంటే, వారు అక్కడ నుంచి బయటకు వచ్చిన తరువాత , 'అసలు తీసిన సినిమాను జనం మూకుమ్ముడిగా రిజెక్ట్ చేసిన తరువాత ఇంకా, ఓటిటి, థియేటర్ అంటూ సాకులు చేబుతారేంటీ' అని కామెంట్ లు చేస్తున్నారు. 

ఏం చేస్తాం, కొందరు ఎప్పటికీ తాము రాంగ్ చేసామని, ఫెయిల్ అయ్యామని అంగీకరించరు. ఆ ఫెయిల్యూర్ కు ఎదుటివారి వైపు నుంచి కారణాలు వెదకడం మొదలుపెడతారు. 

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

Show comments