మరో టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా

టాలీవుడ్ ను కరోనా వణికిస్తోంది. రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, బండ్ల గణేష్, దర్శకుడు తేజ, సింగర్ స్మిత.. ఇలా చాలామంది వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరో ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డాడు. అతడే దర్శకుడు అజయ్ భూపతి.

"ఆర్ఎక్స్100" సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, తనకు కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే తను త్వరలోనే దాని బారి నుంచి బయటపడతానని, ప్లాస్మా కూడా డొనేట్ చేస్తానని ప్రకటించాడు.

ప్రస్తుతం "మహాసముద్రం" అనే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి.. లాక్ డౌన్ తర్వాత అధికారిక ప్రకటన రానుంది. 

వైఎస్సార్ చేయూత

పవన్ కళ్యాణ్ చదివినన్ని బుక్స్ ఏ హీరో చదవలేదు

Show comments