సీమ ప్రాజెక్టు కోసం నోరు మెద‌ప‌వేం చంద్ర‌బాబూ?

అమ‌రావ‌తి కోసం గ‌గ్గోలు పెట్ట‌మంటే రోజుల త‌ర‌బ‌డి ప్ర‌తి రోజూ ఒక జూమ్ వీడియో అంటూ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేస్తూ ఉన్నారు. త‌మ రియ‌లెస్టేట్ ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన అంశం గురించి చంద్ర‌బాబు నాయుడు గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో మ‌రో అంశంపై మాత్రం ఆయ‌న స్పందించ‌డం లేదు. అది రాయ‌ల‌సీమ‌, నెల్లూరు-ప్ర‌కాశం జిల్లాల‌కు సంబంధించిన అంశం. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ఆరు జిల్లాల నీటి క‌ష్టాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం అవుతుంది. ఆ ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు చెబుతుంటే.. చంద్ర‌బాబు నాయుడు స్పందించిన పాపా‌న పోవ‌డం లేదు!

రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే దక్షిణ తెలంగాణాకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణాలో అధికార పక్షం, ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తుంటే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఉత్తం,రేవంత్, భట్టి, నాగం తదితర నేతలు దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరుగుతోందని నిత్యం ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా గొంతు కలపాయి. కానీ ఆంద్రప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, సీపీఐ, బీజేపీలోని తన అనుకూల వర్గం వ్యవహరిస్తున్నాయి. రాయ‌ల‌సీమ ఎత్తి పోత‌ల ప‌థ‌కం నిర్మితం అయితే కేవ‌లం జ‌గ‌న్ కు పేరొస్తుంద‌నే భ‌యం, చంద్ర‌బాబు శ్ర‌ద్ధ అమ‌రావ‌తి మీద త‌ప్ప మ‌రో ప్రాంతం మీద లేక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్టుగా ఉంది. 

రాయలసీమ, నెల్లూరు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే నిమిత్తం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు టెండర్లు పిలిచింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.  ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో అక్కడి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు రాయలసీమ ఎత్తిపోతల పధకం చేపడితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా తెలంగాణాకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రకటించారు. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే రాజకీయంగా ఎక్కడ వెనుక బడిపోతామేమో అన్న కుతంత్రంతోనే ఆలోచిస్తున్నట్లుగా వుంది.

అందుకే చంద్రబాబు భిన్నంగా ఈ పథకం పనులు చేపట్టకుండా వుండేందుకు కొందరు తెలంగాణ ప్రతిపక్ష నేతలతో కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నేర్పింది కుట్రలు, కుతంత్రాలేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే గొంతుతో పనిచేసిన పరిస్థితి పలురాష్ట్రాల్లో చూసాం. కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు వైఖరి వుంటోంది. దీనికి ప్రధాన కారణంగా ఒక కులం, ఎల్లోమీడియాగా ముద్రపడ్డ కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబుకు ఏమిచేసినా అండగా వుండటమే. 

తెలంగాణలో ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి రాయలసీమ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏపిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. నారా బాబు రాష్ట్ర  ప్రయోజనాలను పక్కకు నెట్టి సొంత ప్రయోజనాలకోసం పోరాడుతున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే రాయలసీమ ప్రాజెక్ట్ పై చంద్రబాబు, తన అనుచరణగణం, అనుచర పార్టీలతో క‌లిసి పచ్చమీడియా సహాయంతో కుట్రలు పన్నుతున్నారు. రాయలసీమ  ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయం. 

ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు . హైదరాబాద్ లోని తన విలాసవంతమైన భవంతి లో సేద తీరుతూ అపుడపుడు రాష్ట్ర ప్రాయాజనాల కోసం ఆలోచన చేస్తారు అనుకుంటే జూమ్ బాబు మాత్రం రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటున్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ నష్టం కలిగించే చర్యలు చేపట్టకుండా వుంటే చాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.  కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తమ భావజాలాన్ని వినిపిస్తుండగా అక్కడ ఎల్లోమీడియా తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా తెలుగుదేశం, భజన బృందానికి అనుకూలంగా ఎల్లోమీడియా విషం కక్కుతోంది.

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

Show comments