నాకు తృప్తి ఉండదు: రాధికా ఆప్టే

సినిమాలు, వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్ అనే తేడా లేకుండా మంచి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. తను క్రేజ్ కోసం ఇండస్ట్రీకి రాలేదని, అందుకే ఏదో ఒక సెగ్మెంట్ కే పరిమితమైపోనంటోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని అనిపిస్తుంటుందని, అందుకే పాత్రల విషయంలో తనకు తృప్తి ఉండదంటోంది.

"మనం మన జీవితాల్లో చాలా పనులు చేస్తుంటాం. రోజూ ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటాం. అంతేకాదు.. ఏం చేయకూడదో కూడా తెలుసుకుంటాం. ఇదొక నిరంతర ప్రక్రియ. తప్పులు చేయకుండా ఉండలేం, కానీ కొత్త తప్పులు చేయాలి. అందుకే నా వర్క్ ను నేను ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేసుకుంటాను. అందుకే నాకు తృప్తి ఉండదు. ఇది బాగుంది అని ఫిక్స్ అయిపోను."

సక్సెస్, ఫెయిల్యూర్స్ ను సీరియస్ గా తీసుకోనంటోంది ఈ బ్యూటీ. ఎప్పుడైతే సక్సెస్-ఫెయిల్యూర్ ఫార్ములాలో పడతామో అప్పుడిక మంచి పాత్రలు ఎంపిక చేసుకోలేమని, స్టీరియోటైపు పాత్రలే చేయాల్సి వస్తుందని చెబుతోంది.

కెరీర్ కంటే జీవితం చాలా ముఖ్యం అంటోంది రాధిక. తను అందరిలాంటి మనిషినేనని, తన జీవితాన్ని కూడా సాధారణ జీవితంగానే చూడాలంటోంది. తను చేసే పాత్రలు నచ్చితే అందరూ చూస్తారని.. వాటిపై తనకు పెద్దగా పట్టింపు లేదని అంటోంది.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments