మరి విశాఖకు ఇది అక్కరలేదా?

''....ఎవరూ అడగకుండానే చంద్రబాబునాయుడు సీఎంగా ఉండి అమరావతి రాజధానిని జిల్లాకు కేటాయించారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ ప్రాంతాల మధ్యన అమరావతి రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణం కొనసాగితే ఆ ప్రాంతమే కాకుండా అటు విజయవాడ, ఇటు జిల్లాలోని అన్ని ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి సాధించేవి. అనతికాలంలోనే మేటి నగరంగా అమరావతి రూపాంతరం చెందేది....''

ఇదీ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా వ్యాసంలో పేరాగ్రాఫ్.

ఒక ప్రాంతం రాజధాని అయితే ఎలా అభివృద్ది వుంటుందో తెలిపే వాక్యాలు. మరి ఇలాంటి ప్రగతి విశాఖకు అక్కరలేదా? రాయలసీమకు అవసరం లేదా? ఎందుకు మీడియా అలా విశాఖ మీద, సీమ మీద పగబట్టినట్లు, రాజధాని అంటే అమరావతికి తప్ప మరెవరికి అక్కరలేనట్లు వార్తలు వండి వారుస్తున్నారు. విశాఖకు పాలనా రాజధాని రాకూడదని సర్వ శక్తులు కూడదీస్తున్నారు. ఎన్ని రకాల యాంగిల్స్ లో వార్తలు రాయాలో అన్నీ రాస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు.

ఇదే మీడియా విశాఖకు రాజధాని వస్తుంది అంటే అక్కడ ఆగం ఆగం అయిపోతుందని అంటోంది. మరి ఉత్తరాంధ్ర జనాలు ఇలా ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా వార్తలు వండి వారుస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు. మీకు రాజధాని కావాలి అని అడగడం సబబు. మాకు వద్దు అని చెప్పడానికి మీరు ఎవరు?అని నిలదీయరేమి?  కనీసం ఇలాంటి వ్యాసాలు చదివిన తరువాత అయినా అమరావతి విషయంలో జరుగుతున్న తెరవెనుక తతంగాన్ని ఉత్తరాంధ్ర, సీమ వాసులు తెలుసుకోవాలి. 

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments