చిరు-వీర్రాజు భేటీ.. టీడీపీకి ఎసిడిటీ

చిరంజీవిని ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడంపై టీడీపీ అప్పుడే సెటైర్లు వేస్తోంది. గతంలో చిరంజీవి వైసీపీ అధినేతను కలిశారని, ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం ఉందని, ఇప్పుడేమో ఆయన్ని బీజేపీ నేతలు కలుస్తున్నారని ఇదెక్కడి న్యాయమంటూ ఆడిపోసుకుంటున్నారు టీడీపీ నేతలు, అభిమానులు. అసలు బీజేపీ నేతలు ఎవర్ని కలిస్తే, టీడీపీకి ఎందుకు?

రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వీర్రాజు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన తంటాలేవో తాను పడుతున్నారు. అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందంటే.. వారు ఎంతగా దిగజారిపోయారో వేరే చెప్పక్కర్లేదు.

చిరు-వీర్రాజు సమావేశం అయిపోయిన వెంటనే సోషల్ మీడియా వేదికగా టీడీపీ భనజపరులు అవాకులు చెవాకులు పేలడం మొదలు పెట్టారు. కన్నాని బీజేపీ అధ్యక్షుడిగా తొలగించడంతో టీడీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇన్నాళ్లూ కన్నా లక్ష్మీనారాయణని అడ్డుపెట్టుకుని ఏపీ బీజేపీని పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు చంద్రబాబు. తాము ఏది చెబితే, కాస్త గ్యాప్ తో కన్నాతో అదే చెప్పించడం, అనివార్యంగా పవన్ కల్యాణ్ తో కూడా అలాగే మాట్లాడించటం చేసేవారు.

వీర్రాజు రాకతో తొలిరోజే టీడీపీకి బొమ్మ కనిపించింది. మా ఓటు బ్యాంక్ అంతా టీడీపీ దగ్గరే ఉందని, దాన్ని లాగేసుకుంటామని ఓపెన్ గానే చెప్పారాయన. ఏపీలో వైసీపీకి రాబోయే రోజుల్లో ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేనేనని అన్నారు. అటు సుజనా చౌదరి విషయంలో కూడా వీర్రాజు కాస్త కటువుగానే ఉన్నారు. అమరావతి విషయంలో సుజనా వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధికారికంగానే ఖండించింది. దీంతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు సుజనా నోరు తెరవలేకపోయారు, చంద్రబాబుకి వంతపాడలేకపోయారు.

దీంతో టీడీపీ నేతలు వీర్రాజుని టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఉంటే తమ పప్పులుడకవని వారికి అర్థమైపోయింది. అందుకే ఆయన ప్రతి కదలికపై దృష్టిపెట్టి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నేతలు. చిరుతో ఆయన భేటీ కాగానే ఒక్కసారిగా సోషల్ మీడియాలో దాడి మొదలు పెట్టారు. తమ కడుపుమంటను బైటపెట్టుకున్నారు.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments