ఐపీఎల్ టైటిల్ బిడ్ కోసం పోటాపోటీ..!

చైనీ కంపెనీ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ హోదా నుంచి వైదొలిగిన నేప‌థ్యంలో.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు కొత్త టైటిల్ స్పాన్స‌ర్ ను ప‌ట్టే ప్ర‌య‌త్నంలో ఉంది బీసీసీఐ. ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్ నిర్వ‌హించ‌బోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో భారీ డీల్ నుంచి వివో వైదొల‌గిన నేప‌థ్యంలో కొత్త స్పాన్స‌ర్ ఎవ‌ర‌వుతార‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

ఏడాదికి 440 కోట్ల రూపాయ‌ల పై స్థాయి ఒప్పందంతో వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ గా నిలిచింది. అయితే కొత్త స్పాన్స‌ర్ నుంచి బీసీసీఐ కూడా అంత పెద్ద మొత్తం ఆశించ‌డం లేద‌ట‌! ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల ప్ర‌కారం.. త‌క్కువ మొత్తానికే అయినా స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను అమ్మ‌డానికి ఐపీఎల్ నిర్వాహ‌కులు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ఒక ద‌శ‌లో బీసీసీఐకి వివో  ఒక రిక్వెస్ట్ పంపింద‌ట‌. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 50 శాతం రేటులో ఐపీఎల్ కు టైటిల్ స్పాన్స‌ర్ గా కొన‌సాగ‌డానికి రెడీ అని పేర్కొంద‌ట‌. అప్పుడు బీసీసీఐ కూడా ఏం స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం వివో పూర్తిగా వైదొల‌గ‌డంతో కొత్త స్పాన్స‌ర్ రావ‌డం ఖ‌రారు అయ్యింది.

ఇప్పుడు ఊపు మీద ఉన్న వ్యాపారాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆన్ లైన్ మార్కెట్ మాత్ర‌మే. ఇ-కామ‌ర్స్ సైట్లు, ఇ లెర్నింగ్, ఆన్ లైన్ బెట్టింగ్ త‌ర‌హా సైట్లు ఇప్పుడు భారీ లాభాల‌ను సాధిస్తున్నాయి. ఆ రంగంలోని అమెజాన్, బైజూస్, అన్ అకాడ‌మీ, డ్రీమ్ 11 వంటి వ్యాపారాల వాళ్లు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీ ప‌డుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు క‌నీసం 300 కోట్ల రూపాయ‌ల పై స్థాయి మొత్తాల‌ను ఆఫ‌ర్ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ ర‌కంగా చూస్తే.. వివో వైదొల‌గ‌డం కూడా బీసీసీఐకి మేలే అని, 50 శాతం డిస్కౌంట్ తో ఆ సంస్థ ఒప్పందాన్ని కొన‌సాగించ‌డానికి ఓకే చెప్పింద‌ట మొద‌ట‌. ఇన్నేళ్లూ స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో బీసీసీఐ కూడా అందుకు ఓకే చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి అవ‌స‌రం లేద‌ని.. వివో కన్నా చాలా ఎక్కువ మొత్తంతో ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని బీసీసీఐ వ‌ర్గాలు మీడియాకు స‌మాచారం ఇస్తున్నాయి.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments