మెగా..మెహర్...వేదాళం?

చాలా కాలం తరువాత సినిమా డైరక్షన్ చేయబోతున్నారు మెహర్ రమేష్ అని వార్తలు ఆ మధ్య వినవచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్ క్యాంప్ లో వున్నారు మెహర్ రమేష్. ఆయన ఓ చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని కూడా వినిపించింది. 

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, అప్పుడెప్పుడో వచ్చిన షాడో సినిమా తరువాత మెహర్ రమేష్ చేయబోయే మెగాస్టార్ సినిమాకు తమిళ సినిమా వేదాళం ఆధారం అని తెలుస్తోంది.

ఆధారమే కాదు, వేదాళం రీమేక్ నే మెగాస్టార్ చేయబోతున్నారని, దానికే మెహర్ రమేష్ డైరక్షన్ చేస్తారని వినిపిస్తోంది. నిర్మాతగా ఎవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు. 

కేఎస్ రామారావుకు ఓ సినిమా చేయాలన్నది మెగాస్టార్ కోరిక. తనయినా చేయాలి, లేదా చరణ్ అన్నా చేయాలి. అందువల్ల చరణ్ ప్రాజెక్టు సెట్ కాకపోతే, వేదాళం రీమేక్ కు కేఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుంది.

తమిళంలో అజిత్-శృతి హాసన్ నటించిన వేదాళం సినిమాలో తెలుగు భారీ సినిమాకు సరిపడా కథ వుంది. అందువల్ల మెహర్ రమేష్ కు మంచి ప్రాజెక్టునే దొరికినట్లు అనుకోవాలి.

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments