బండ్ల గణేష్ గా ఆర్జీవీ

ఆర్జీవీ తీస్తున్న ఏటిటి సినిమా పవర్ స్టార్. మెగా హీరో పవన్ కళ్యాణ్ ను అన్యాపదేశంగా చూపిస్తూ తీస్తున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత బండ్ల గణేష్, అల్లు అరవింద్ లాంటి క్యారెక్టర్ లు వుంటాయని ఇప్పటికే వదిలిన స్టిల్స్ ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ను డైరక్టర్ రామ్ గోపాల్ వర్మనే పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కు పెద్దగా డైలాగులు వుండవని తెలుస్తోంది..''అబ్బబ్బా...అన్నా...నువ్వు దేవుడివన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అన్నా...నీకు తిరుగులేదన్నా' ఇలాంటి డైలాగు మాత్రమే వుంటుందని తెలుస్తోంది.

ఆర్జీవీ తన సినిమాలో తనే వేషం వేస్తే ఇది తొలిసారి అవుతుంది. పైగా సోషల్ మీడియాలో మాంచి పాపులారిటీ వున్న బండ్ల గణేష్ వేషం వేస్తే మరీ హైలైట్ అనుకోవాలి.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను

Show comments