కేసీఆర్‌ను ఇంత‌గా ఎవ‌రూ తిట్ట‌లేద‌బ్బా...

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఇటీవ‌ల కాలం విమ‌ర్శ‌ల దాడి క్ర‌మంగా పెరుగుతోంది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో మొద‌ట్లో కేసీఆర్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ....ప్ర‌త్య‌ర్థులు కూడా ‘ఔరా’ అనిపించారు. అయితే రానురాను తెలంగాణ‌లో విజృంభిస్తుం డ‌డం, నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. తెలంగాణ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డంలో నిర్ల‌క్ష్యంపై తెలంగాణ హైకోర్టు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ అర‌వింద్ ప‌రుష ప‌ద‌జాలంతో దూష‌ణ ప‌ర్వానికి దిగారు. వ‌రంగ‌ల్‌లో బీజేపీ అర్బ‌న్ జిల్లా కార్యాల‌యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై తిట్ల వ‌ర్షం కురిపించారు. కేసీఆర్ పనికి మాలిన ముఖ్య‌మంత్రి  అని మండిప‌డ్డారు. క‌రోనాతో తెలంగాణ స‌మాజం భ‌యంతో వ‌ణికిపోతుంటే...సీఎం కేసీఆర్ త‌న ఫామ్‌హౌస్‌లో ఉంటారా? అని ఘాటుగా ప్ర‌శ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీని జిన్నాతో పోలుస్తారా..? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కేసీఆర్‌ను గ‌తంలో ఎవ‌రూ విమ‌ర్శించ‌ని రీతిలో అర‌వింద్ మాట్లాడారు. దగుల్ బాజీ హిందు కేసీఆర్ అంటూ తూల‌నాడారు. కేసీఆర్ పెద్దకొడుకు ఓవైసీ అని  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను

Show comments