ఆర్ కి ఆర్ఆర్ క్లారిటీ?

ఆర్ అంటే రాజమౌళి..ఆర్ఆర్ అంటే రామారావు, రామ్ చరణ్..ఈ క్లారిటీ తెలుగు సినిమా అభిమానులకు ఫుల్ గా వుంది. ఇప్పుడు ఆ ఆర్ కు ఈ ఇద్దరు ఆర్ లు ఫుల్ క్లారిటీ ఇచ్చేసారట. వీలయినంత త్వరగా ఆర్ఆర్ఆర్ సినిమా ఫినిష్ చేసి, తమను బయటపడేయమని. లేదూ అంటే తమ కెరీర్ కు కష్టం అని క్లారిటీ ఇచ్చేసారట. ధృవ, రంగస్థలం తరువాత రామ్ చరణ్, జనతా గ్యారేజ్, లవకుశ, అరవింద సమేత సినిమాల తరువాత ఎన్టీఆర్ ల కెరీర్ ఫుల్ ఊపులో వుంది. ఇలాంటి టైమ్ లో జస్ట్ పాతిక, ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ కే ఓకె అనేసి, రాజమౌళి సినిమా ఒప్పేసుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఆ లెవెల్ వేరు కదా అని. 

కానీ ఇప్పుడేమయింది. రెండేళ్లు వృధాగా పోయాయి. మరో ఏడాది వృధాగా పోయేట్లు కనిపిస్తోంది. దాదాపు రెమ్యూనిరేషన్ పరంగా యాభై అరవై కోట్లు లాస్.  ఆ సంగతి అలా వుంచితే సరైన సినిమాలు చేసి కెరీర్ ను పైకి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతోంది. 

అందుకే కరోనా కల్లోలం ముగియగానే వీలయినంత త్వరగా సినిమాకు ప్యాకప్ చెప్పమని ఇద్దరు హీరోలు అస్సలు మొహమాటపడకుండా రాజమౌళికి చెప్పేసారని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఇప్పటికి సినిమా యాభై శాతం పూర్తయింది. అది కూడా సినిమాలో సులువైన పార్ట్. అసలు సిసలు షూట్ అంతా ముందే వుంది. స్టార్ కాస్ట్ అంతా ముందే వుంది. అందువల్ల ఎప్పటికి పూర్తవుతుందన్నది క్లారిటీ లేనట్లు కనిపిస్తోంది.

2022 సంక్రాంతినే

ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ విడుదల 2022 సంక్రాంతికే అని వినిపిస్తోంది. సినిమా వర్క్ కరోనా కల్లోలం ముగిసి స్టార్ట్ చేసిన నాటి నుంచి తొమ్మిది నెలలు వుంటుందని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే  2021 సమ్మర్ కు అందుకోవడం ఈజీ కాదు. దసరా అన్నది సరిపోయే సీజన్ కాదు. అందువల్ల మళ్లీ 2022 సంక్రాంతికే ఆర్ఆర్ఆర్ అని లెక్కలు చెబుతున్నారు. అలా అయితే ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమా చూసి ఎన్నేళ్లు అవుతుందో? రామ్ చరణ్ సినిమా చూసి ఎన్నేళ్లు అవుతుందో?

హీరోలతో  కాంపిటీషన్?

ఇదిలా వుంటే ఈ గ్యాప్ లో బన్నీ దూసుకుపోతున్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో రికార్డులు అన్నీ తుడిచిపెట్టేసాడు. ఆర్ఆర్ఆర్ విడుదల లోపే పుష్ప సినిమా ఫినిష్ చేసేస్తాడు. ఏ మాత్రం అవకాశం వున్నా మరో సినిమా కూడా చేసేయాలని చూస్తున్నాడు. మహేష్ బాబు కూడా రెండు సినిమాలు కనీసం చేసేస్తాడు. ఇది ఫ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బందిగా వుంటుంది. పైగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ అలా కూర్చోవడం అన్నది ఎంత వరకు సాధ్యం అన్నది చూడాలి. ఇప్పటికే ఏడు నెలలు అయింది. మరో ఏడాదికి పైగా త్రివిక్రమ్ కూర్చుంటారా?  బన్నీతోనో, పనన్ తోనో ఓక సినిమా లాగించేయాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు ఎలా వుంటుంది?

రెండు భాగాలు?

ఈ పరిస్థితులు అన్నీ అవాయిడ్ చేయడానికి బాహుబలి మాదిరిగా ఆర్ఆర్ఆర్ ను కూడా రెండు భాగాలు చేస్తే అన్న ఆలోచన వుందని సుదూరపు గ్యాసిప్ ఒకటి వినిపిస్తోంది. ఇప్పటి వరకు అయిన ఫుటేజ్ , ఫస్ట్ పార్ట్ వరకు కావాల్సినది షూట్ చేసి, సమ్మర్ కు ఒక పార్ట్ వదిలేసి, రెండు భాగాన్ని 20222 సంక్రాంతికి వదులుతారు అంటున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని అంటున్నాయి ఆర్ఆర్ఆర్ యూనిట్ వర్గాలు.

మొత్తం మీద పెద్ద హీరోలను, పెద్ద దర్శకులను, పెద్ద బ్యానర్లను పూర్తిగా నష్టాల్లో ముంచి, ఎదురుచూపుల్లో ఇరుక్కుపోయేలా చేసింది రాజమౌళి ఆర్ఆర్ఆర్. అది వాస్తవం. 

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను

మామా కోడలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Show comments