ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెర

ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అతడు నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఎల్లుండి (జులై 10న) ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

జులై 10న సరిగ్గా 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాకు రాథేశ్యామ్ అనే టైటిల్ ను పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజుల కిందటే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టైటిల్ ను ఓన్ చేసుకొని ట్రెండింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ పై ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ కోసం, టైటిల్ కోసం అతడి ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ మాత్రం ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చింది. ఒక దశలో సహనం కోల్పోయిన అభిమానులు బ్యాన్ యూవీ క్రియేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

అలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభాస్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ఎల్లుండి ఉదయం 10 గంటలకు రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాథాకృష్ణ కుమార్ దర్శకుడు.

వైఎస్సార్ జయంతి వేడుకలు

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

Show comments