టీడీపీ నోరు నొక్కేసిన జగన్

జగన్ అంటే ఏమో అనుకున్నారు. ఆయన మీద కూడా అబద్దాలు, అభాండాలు ప్రచారం చేస్తే జన ఈజీగా నమ్ముతారన్న కుత్సిత ఆలోచనతోనే పచ్చ పార్టీ గత ఏడాదిగా ఎత్తులు వేస్తోంది.

అయితే ఆ ఎత్తులన్నీ ఎప్పటికపుడు జగన్ చిత్తులు చేస్తూ తాను సగటు రాజకీయ నాయకుడిని కానే కాదని పదే పదే రుజువు చేసుకున్నారు. దానికి ఇపుడు మరో నిట్ట నిలువు నిదర్శనం విశాఖ ఎల్జీ పాలిమర్స్ పాపానికి బాధ్యులైన 12 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేయించడం.

ఈ విషయంలో ఎంత చర్చ జరిగింది. మరెంత రాద్ధాంతం జరిగింది. వైసీపీ సర్కార్ ఆ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కు అయిందని అందుకే అరెస్టులు లేవని నాడు తమ్ముళ్లు గట్టిగా మాట్లాడారు. బాధితుల పక్షం కాకుండా ప్రభుత్వం యాజమాన్యానికి కొమ్ము కాస్తోందని చెప్పి నిప్పు రాజేశారు.

అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ రావడం, అక్కడికక్కడే కనీ వినీ ఎరుగని రీతిలో కోటి రూపాయల‌ భారీ నష్టపరిహారం ఒక్కొక్క  బాధిత కుటుంబానికీ ప్రకటించడం జరిగాయి. ఆ తరువార హై లెవెల్ కమిటీని కూడా ప్రమాదానికి కారణాలను అన్వేషించడానికి నియమించారు.

ఆ కమిటీ నివేదిక ముఖ్యమంత్రి చేతుల్లోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి చెందిన కీలక బాధ్యులతో పాటు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా చెబుతున్నారు. అంతే కాదు చెప్పిన మాట ప్రకారం గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాలకు హెల్త్  క్లినిక్ ని కూడా తీసుకువచ్చారు. ఇక జనవాసాల్లో ప్రమాదకర పరిశ్రమలు ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇపుడు టీడీపీ ఏమంటుందో. నోరు నొక్కుకుపోయి తమ్ముళ్ళు సైలెంట్ అవుతారేమో.

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది

వైఎస్సార్ జయంతి వేడుకలు

Show comments