రాశిఫలాలు..05.07.20 నుంచి 11.07.20 వరకు

మేషం: చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఎంతటి సమస్య ఎదురైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థికం.. అనుకున్న విధంగా రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరతాయి. షేర్ల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము దక్కించు కుంటారు. కుటుంబం...అందరి ప్రేమాభిమానాలను పంచుకుంటారు. మీ ప్రతిభను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. ఎంతోకాలంగా ఎదురవుతున్న సమస్య ఒకటి బంధువుల సాయంతో పరిష్కరించుకుంటారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆరోగ్యం....కొంత మందగించినా తక్షణం ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు...విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు.. కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు కొంత నిజమవుతాయి. మహిళలకు సమస్యలు తీరే సమయం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు వెంటాడవచ్చు. ఆర్థికం.. రావలసిన డబ్బు మొదట్లో ఆలస్యమైనా చివరికి అందుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. మొత్తం మీద ఈ వారం మిగులు బడ్జెట్‌తోనే నిలబడతారు. కుటుంబం.. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. అందరి తోనూ సఖ్యంగా మెలుగుతూ వారి ఆదరణ పొందు తారు. ఆరోగ్యం...గతం కంటే మెరుగుపడుతుంది. శారీరకంగా, మానసికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు.. కొత్త పెట్టుబడులతో లాభాలు ఆర్జిస్తారు. కొంతకాలంగా కుంటుపడిన వ్యాపారాలు పుంజుకుం టాయి. ఉద్యోగాలు... అవరోధాలు అధిగమించి విధు లు నిర్వహిస్తారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారు లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికం...రుణబాధలు కాస్త తొలగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. ఆస్తులు విక్రయాలు ఎట్టేకలకు పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు. కుటుంబం.. కొంతకాలంగా ఒకరి ఆరోగ్యంపై సతమతమవుతున్న మీకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబసభ్యులు మీకు సహాయంగా నిలిచి ఐక్యతను చాటుకుంటారు. ఆరోగ్యం.. నలత చేసినా తక్షణ ఉపశమనం పొందుతారు. కొంతమేర వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు.. లాభసాటిగా సాగుతాయి. కొత్త భాగస్వాములు చేరికతో మరింత బలపడతారు. ఉద్యోగాలు.. ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు సైతం తగ్గుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల కషి ఫలిస్తుంది. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందడుగు వేసి కార్యాలు చక్కదిద్దుతారు. ఆర్థికం.. మరింత పుంజుకుంటారు. అప్రయత్నంగా కొంత ధనప్రాప్తి కలిగే అవకాశం. కొంతమేర రుణాలు తీరతాయి. ఆస్తుల విక్రయాలు విజయవంతంగా ముగిసి కొంత సొమ్ము అందుకుంటారు. కుటుంబం... శుభకార్యాలపై సోదరులతో చర్చిస్తారు. మీరంటే కుటుంబసభ్యులు మరింత అభిమానం చూపుతారు. విదేశాలలోని సంతానం ఆరోగ్యంపై శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు....అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులకు ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలు.. సహచరులు సైతం సహకరిస్తారు. విధి నిర్వహణపై మీ శ్రద్ధ పైవారిని ఆకట్టుకుంటుంది. తద్వారా గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక, రాజకీ యవేత్తలకు చిక్కులు తొలగుతాయి. మహిళలకు మన శ్శాంతి లభిస్తుంది. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూ లం. వేంకటేశ్వరస్వామి నామస్మరణ మంచిది.

సింహం: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన  ఎదురవుతుంది. ఆర్థికం...అనుకున్న రాబడి దక్కుతుంది. ఇబ్బందులు అధిగమించి అవసరాలు తీర్చుకుంటారు. స్థిరాస్తి విక్రయాలు సైతం పూర్తి చేసి సొమ్ము అందుకుంటారు. కుటుంబం.. అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. సంతానపరంగా చికాకులు తొలగుతాయి. పెద్దల సలహాలు పాటిస్తారు. మీ సేవా కార్యక్రమాలపై బంధువులు ప్రశంసలు కురి పిస్తారు. ఆరోగ్యం....కొంత మందగించవచ్చు. అయితే వైద్యసలహాలు స్వీకరించి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు....లాభాల బాటలో నడుస్తారు. పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యో గాలు...కోరుకున్న విధంగా మార్పులు ఉంటాయి. సహచర ఉద్యోగులు మీకు కొంత సహాయపడవచ్చు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు సోదరుల ద్వారా ధనలాభ సూచనలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై ఇబ్బంది పెట్టవచ్చు. అయినా ఆత్మస్క్థెర్యంతో ముందుకుసాగి పరిష్కరించుకుంటారు. ఆర్థికం...అనుకున్న ఆదాయం సమకూరుతుంది. అయితే అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఆస్తుల విక్రయాలలో ప్రతిష్ఠంభన. కుటుంబం....మీపట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ విధేయత చూపుతారు. మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. వివాహాది వేడుకలపై బంధువర్గంతో చర్చిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కొనసాగిస్తారు. ఆరోగ్యం....శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు....ఆశించిన లాభాలు అందినా ఏదో వెలితిగానే కనిపిస్తుంది. పెట్టుబడులు మరింత అందుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలు...చికాకులు తొలగుతాయి. విధుల్లో కొన్ని బాధ్యతలు తగ్గే సూచనలు. పారిశ్రామిక వేత్తలకు కొన్ని అంచనాలు నిజం కాగలవు.మహిళలకు ఆస్తి విషయాలలో సమస్యలు తీరవచ్చు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

తుల: అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి విజయాల వైపు సాగుతారు.ఆర్థికం....ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగు తాయి. స్థిరాస్తి విక్రయాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం....బంధువుల సహాయసహకారాలు అందు తాయి. శుభకార్యాలపై తుది నిర్ణయాలు తీసుకుం టారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. విదేశాలలో ఉన్న సంతానం క్షేమసమాచారాలు అంది ఊరట లభిస్తుంది. ఆరోగ్యం...దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు...క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలు....ఒడిదుడుకులు, సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన రీతిలో ఆస్తి లాభం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వశ్చికం: ఏ కార్యక్రమమైనా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు. ఆధ్యాత్మిక కార్యక్ర మాలలో పాల్గొంటారు. ఆర్థికం.. ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణాల కోసం యత్నిస్తారు. షేర్ల విక్రయాలు పూర్తి చేసినా సకాలంలోసొమ్ములు అందక అవస్థలు. కుటుంబం.. సోదరులు, సోదరీలతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. విదేశాలలోని వారి ఆప్తుల క్షేమసమాచారాలపై ఆదుర్దా. కొన్ని వేడుకలు సమయానుసారం వాయిదా వేస్తారు. ఆరోగ్యం....కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు....లాభాలు స్వల్పంగా దక్కించుకుంటారు. విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలు.. ఊహించని మార్పులు సంభవం. పైస్థాయి వారు ఒత్తిడులు పెంచుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: వీరికి అన్ని విధాలా అనుకూల సమయమే. ఆలోచనలు అమలు చేయడంలో ముందుంటారు. ఆర్థికం....రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువుల నుంచి కూడా ధనసహాయం రావచ్చు. స్థిరాస్తి విక్రయాలు ఎట్టేకలకు పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. కుటుంబం....మీపై అంతా విశేష ఆదరణ చూపుతారు. మీ మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. మీ నిర్ణయాల కోసం ఎదురుచూస్తుంటారు. విదేశాలలోని ఆప్తుల క్షేమసమాచారాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యం....శారీరక రుగ్మతలు చాలావరకూ తొలగుతాయి.  వ్యాపారాలు...అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలు...ఎటువంటి మార్పులు జరిగినా తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను మెప్పిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఈతిబాధలు తొలగుతాయి. మహిళలకు అంచనాలు నిజం కాగలవు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: చాకచక్యం, నేర్పుతో సమస్యల వలయం నుంచి గట్టెక్కుతారు. ప్రస్తుత పరిస్థితులను సైతం అధిగమించి మీ కార్యాలను చక్కదిద్దుతారు. ఆర్థికం.. డబ్బులకు లోటు లేకుండా గడిచిపోతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. పోగొట్టుకున్న డబ్బు కూడా చేతికందే అవకాశం. కుటుంబం...అందరి ప్రేమానురాగాలు పొందుతారు. సంతాన వివాహయత్నాలు కలసివస్తాయి. పెద్దల సలహాలు పాటిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. ఆరోగ్యం....కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.  వ్యాపారాలు...అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలు...మీపై  వచ్చిన అభియోగాలు తొలగుతాయి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు భూలాభాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హదయం పఠించండి.

కుంభం: ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికం....ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. రుణదాతలు సైతం ఒత్తిడులు తగ్గిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. కుటుంబం....సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దూరపు బంధువుల రాకతో కొంత ఉత్సాహం నెలకొంటుంది. ఆరోగ్యం...కాస్త రుగ్మతలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు.. క్రమేపీ లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు లోటు లేనివిధంగా గడిచిపోతుంది. ఉద్యోగాలు....కోరుకున్న మార్పులు ఉంటాయి. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కవచ్చు. మహిళలకు మానసిక ప్రశాంతత. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

మీనం: వీరికి వారమంతా హడావిడిగానే గడిచిపోతుంది. ఎటువంటి కార్యక్ర మమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికం...గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబా ధలు తొలగుతాయి. షేర్ల విక్రయాలు పూర్తి చేసి సొమ్ము సమకూర్చుకుంటారు. కుటుంబం.. విదేశాలలోని సంతానం విషయంలో ఆందోళన తొలగుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు.  ఆరోగ్యం.. గతం కంటే మెరుగుపడు తుంది. వైద్యసేవలకు స్వస్థి చెబుతారు. వ్యాపారాలు.. ఆశించిన లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడు లకు మార్గం సులభతరమవుతుంది. ఉద్యోగాలు.. విధుల్లో సమర్థత చాటుకుంటారు. మీకు ఎదురులేని విధంగా మసలుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు కీలక సమాచారాలు అందుతాయి. మహిళలకు స్వల్ప ధనలాభాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com

Show comments