మరో మలుపు తీసుకున్న న్యూడ్ వీడియోల కేసు

గుంటూరుకు చెందిన బీటెక్ స్టూడెంట్ నగ్న దృశ్యాల్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసులో పోలీసులు మరో పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన ఇద్దరు వ్యక్తుల్ని (వీళ్లు కూడా ఆ కాలేజ్ విద్యార్థులే) అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మూడో వ్యక్తి ఎవరనే విషయాన్ని కనిబెట్టారు. అతడి అరెస్ట్ మాత్రం మిగిలి ఉంది.

ప్రస్తుతం ఆ మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయినప్పటికీ పట్టుకొని కటకటాల వెనక్కి పంపుతాం అంటున్నారు పోలీసులు. డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న భార్యాభర్తల ముద్దులకొడుకు, ఆ మూడో వ్యక్తి ఒకడే అనేది అందరి అనుమానం.

విద్యార్థినిని లోబరుచుకొని న్యూడ్ వీడియోస్ తీసిన వరుణ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వాటిని పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేసిన కౌశిక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవే వీడియోల్ని "మై నేజ్ ఈజ్ 420" అనే యూజర్ ఐడీతో ఇనస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు మరో విద్యార్థి. అతడు ఎవరనే విషయాన్ని పోలీసులు కనిబెట్టారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న భార్యాభర్తల ముద్దుల కొడుకు, ఈ "420" ఒకడే అని అనుమానిస్తున్నారు.

దిశ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసును పోలీసులు దాదాపు చేధించారు. సోషల్ మీడియా నుంచి ఆ న్యూడ్ వీడియోస్ ను పూర్తిగా తొలిగించారు. కాకపోతే ఇప్పుడు ఆ మూడో వ్యక్తి దొరకాలి. దీంతో పాటు వరుణ్ మరో గర్ల్ ఫ్రెండ్ కు, కౌశిక్ చెల్లెలకు కూడా ఇందులో ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు.. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. 

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

Show comments