బ్యాలెన్స్...కరోనా తరువాతే

సినిమా రంగం కాస్త ఇబ్బందుల్లో వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఇబ్బందుల్లో వుంది. మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఎక్కడ సినిమాలు అక్కడ వున్నాయి. థియేటర్ల ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఓ డైరక్టర్ తన రెమ్యూనిరేషన్ బ్యాలన్స్ కోసం అడిగి, నిర్మాతతో నో అనిపించుకున్నారని, ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది.

కాస్త గట్టి బడ్జెట్ తోనే తయారైన ఓ సినిమా విడుదలకు రెడీ అయిపోయింది. డైరక్టర్ కు 70 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చారట. కరోనా టైమ్ లో ఖర్చులు వుంటాయి కదా, అందుకే ఆ డైరక్టర్ ఇటీవల నిర్మాతను తన బ్యాలెన్స్ లో కాస్త మేజర్ షేర్ పంపమని కోరినట్లు తెలుస్తోంది. కానీ దానికి ఆ నిర్మాత, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని, సినిమా విడుదల అయిన తరువాత చూద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

కరోనా ఎప్పుడు ముగుస్తుందో? ఎప్పుడు సినిమావిడుదలవుతుందో? ఫలితం ఎలా వుంటుందో? అప్పుడు నిర్మాత ఏమంటారో? ప్రస్తుతానికి అయితే అడిగి నో అనిపించుకున్నట్లు అయింది ఆ డైరక్టర్ పరిస్థితి అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ

Show comments