యువి ఇక కేరాఫ్ చిన్న సినిమాలు

యువి బ్యానర్ అంటే మిర్చి...సాహో...ఇలాంటి భారీ సినిమాలు  గుర్తుకువస్తాయి. కానీ ఇకపై యువి నుంచి భారీ సినిమాలు రావని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న రాథేశ్వామ్ సినిమా తరువాత ఇక భారీ సినిమాలు లేనట్లే. ప్రభాస్ ఓ సినిమాను నాగ్ అశ్విన్ తో చేయబోతున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో తానాజీ సినిమా డైరక్టర్ ఓమ్ రౌత్ తో ఫిక్స్ అయింది. ఆ సినిమాను యువి వంశీనే ఫిక్స్ చేసారు కానీ నిర్మాణంలో ఆయనకేమీ సంబంధం లేదు. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనిరేషన్ కింద ఓవర్ సీస రైట్స్ లేదా తెలుగు రైట్స్ తీసుకునేలా డిస్కషన్ జరుగుతోంది. 

యువికి మిగిలింది ఒక్కటే. రామ్ చరణ్ డేట్ లు. కానీ డైరక్టర్ ఎవరూ లేరు. పైగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్, ఆచార్య తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి వుంది. దాని తరువాతే యువి దగ్గరకు వస్తే వచ్చేది.

అందువల్ల యువి ఇక వరుసగా చిన్న, మీడియం సినిమాల మీద దృష్టి పెడుతోంది. కొత్త డైరక్టర్ తో ఓ సినిమా, కొత్త హీరోలను పరిచయం చేస్తూ ఓ సినిమా, మారుతి డైరక్షన్ లో మరొ సినిమా ఇలా మూడు నాలుగు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. కానీ అన్నీ కూడా చిన్న, మీడియం సినిమాలే. మారుతి సినిమా ఒకె అయితే అది ఒక్కటే ఓ రేంజ్ సినిమా అవుతుంది. 

మేర్లపాక గాంధీ పై దృష్టి పెట్టి వుంచారు. కానీ ఆయన ఇప్పటికే బయట బ్యానర్లకు వెళ్లిపోయారు. అక్కడే రెండు సినిమాలు చేసి కానీ యువి దగ్గరకు రాకపోవచ్చు.

Show comments