వకీల్ సాబ్ కు 'గంగ' ఓకే చెప్పిందా?

వకీల్ సాబ్ హీరోయిన్ వ్యవహారం సాగుతూనే ఉంది. ఫిక్స్ అయిందనుకున్న శృతిహాసన్ ఆఖరి నిమిషంలో తప్పుకోవడం, ఆ వెంటనే లాక్ డౌన్ పడ్డంతో వకీల్ సాబ్ కు హీరోయిన్ దొరక్కుండా పోయింది. ఆ తర్వాత ఇలియానా, కీర్తిసురేష్ లాంటి పేర్లు వినిపించినప్పటికీ తాజాగా తమన్న పేరు తెరపైకొచ్చింది.

అవును.. వకీల్ సాబ్ లో చిన్న హీరోయిన్ పాత్ర కోసం తమన్నను సంప్రదించినట్టు తెలుస్తోంది. పవన్ సినిమా కావడంతో చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ చేయడానికి తమన్న ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్-తమన్న కాంబినేషన్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు మిల్కీబ్యూటీకి పవన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

అయితే తమన్న దాదాపు ఫిక్స్ అయినప్పటికీ ఆమె పేరు ప్రకటించే పొజిషన్ లో లేదు యూనిట్. ఎందుకంటే ఇప్పుడు యూనిట్ దృష్టి మొత్తం పైరసీపై పడింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ కోర్టు సీన్ వీడియో, దానికి సంబంధించిన ఫొటోలు లీకయ్యాయి. లీక్ అయిన వీడియో మరింత విస్తరించకుండా పవన్ ఫ్యాన్స్ బాగానే అరికట్టగలిగారు కానీ ఫొటోలు మాత్రం ఫుల్ గా సర్కులేట్ అయిపోయాయి.

ఇప్పటివరకు తీసిన ఫూటేజ్ ను కాపాడుకోవడం ఎలా అనే అంశంపై అంతా ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. లీకేజీకి సంబంధించి ఇప్పటికే యూనిట్ మొత్తాన్ని ఓ రౌండ్ వేసుకున్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు మరిన్ని భద్రతాచర్యలపై దృష్టిపెట్టాడు.

సో.. తమన్న ఈ ప్రాజెక్టులోకి ఎంటరైనప్పటికీ ఇప్పట్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. పైగా సినిమా కూడా ఇంకా సెట్స్ పైకి రాలేదు కాబట్టి, హీరోయిన్ మేటర్ ను ఇప్పట్లో రివీల్ చేయరనే అనుకోవాలి.

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

Show comments