విజయసాయిరెడ్డి కీలకం?

విపక్షాలు ఎంత ఆయన్ని విమర్శించినా, స్వపక్షంలో కొందరు సైతం ఆయన మీద లోలోపల గుస్సా అవుతున్నా ఆయన విశాఖ సాయిరెడ్డేనని మరో మారు రుజువు అయింది. మళ్ళీ ఆయనకే ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల బాధ్యతలను పార్టీ అధినేత జగన్ ఎంతో నమ్మకంగా అప్పగించారు.

నిజానికి 2015 వరకూ స్తబ్దుగా ఉన్న వైసీపీ   విజయసాయిరెడ్డి విశాఖకు వచ్చిన తరువాతనే ఈ ప్రాంతంలో గట్టిగా  పుంజుకుందని చెప్పాలి. విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యం, ఆయన మేధావితనంతో మొత్తానికి మొత్తం మూడు జిల్లాలను ఊడ్చేసి వైసీపీకి పట్టం కట్టేలా చూశారు.

ఉత్తరాంధ్రా కంచుకోట అని టీడీపీ ఎంత బీరాలు పోయినా మంచుకోటగా మార్చడంలో విజయసాయిరెడ్డి పోషించిన అతి ప్రధానమైన పాత్రను ఎవరూ విస్మరించలేనిది. పార్టీకి నాయకులు ఉన్నారు, ప్రాణమిచ్చే కార్యకర్తలు కూడా ఉన్నారు. జగన్ వేవ్ ఉంది. అయినా సరే అందరినీ, అన్నింటినీ సమన్వయపరచే శక్తి  ఉండాలి. అదే విజయసాయిరెడ్డి అని చెప్పాలి.

ఆయన దూరద్రుష్టి, అంకితభావం, అటు పార్టీకి, ఇటు క్యాడర్ కి మధ్య వారధిగా నిలిచే తీరు అన్నీ కలసి ఆయనని ఈ స్థానంలో ఉంచాయని ఎవరైనా  అంటారు. ఎవరేమనుకున్నా విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేళ జగన్ బహుమతిగా ఇచ్చింది అతి పెద్ద బరువు మాత్రమే.  టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లుగా ఏదో, మరేదో కాదు, టన్నుల కొద్దీ  బరువు బాధ్యతలే సాయిరెడ్డికి జగన్ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలో పార్టీని పూర్తిగా పర్యవేక్షించి బలోపేతం చేసే గురుతర కర్తవ్యాన్ని జగన్ సాయిరెడ్డికి గుర్తు చేస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కానుకగా ఇచ్చారనుకోవాలి. ఎవరెన్ని విభేధాలు స్రుష్టించాలనుకున్నా జగన్ విజయసాయిరెడ్డి మధ్య ద్రుఢతరమైన బంధం ఉందని చెప్పడానికి కూడా ఈ బాధ్యతలు అప్పగింత ఓ  ఉదాహరణగా చెబుతున్నారు.

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

Show comments