పెద్ద సినిమాలు ఓటిటికి రానట్లేనా?

నిశ్శబ్దం..ఉప్పెన..పాతిక కోట్లకు పైనే...వి...ముఫై అయిదు కోట్లకు పైనే. ఈ సినిమాలు ఓటిటి లోకి వస్తాయా? రావా? అన్నప్రశ్నకు టాలీవుడ్ లో సమాధానాలు రకరకాలుగా వున్నాయి. నిశ్శబ్దం సినిమా డీల్ సెట్ అయింది కానీ అగ్రిమెంట్ అన్నది నెవ్వర్ ఎండింగ్ ప్రాసెస్ గా వుంది. దీనికి ఒకటి కాదు, రెండు కాదు అనేక గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిర్మాతలు మాత్రం ఇంకా సిజి వర్క్ పూర్తి కాకపోవడం తప్ప మరే కారణం లేదంటున్నారు. 

వి సినిమాకు సౌండ్ మిక్సింగ్ వర్క్ పెండింగ్ లో వుంది. అది ముంబాయిలో జరగాలి.  ఈ సినిమాను ఓటిటికి ఇవ్వడం దర్శకుడు ఇంద్రగంటికి అంతగా ఇష్టం లేదు. ఆ మాట ఆయన క్లియర్ గా తన ఇంటర్వ్యూలోనే చెప్పేసారు. నిర్మాత దిల్ రాజు ఇవ్వాలనుకున్నా కూడా కనీసం 35 కోట్ల ఆఫర్ రావాలి. 

ఉప్పెన సినిమా ఇప్పటికే డిజిటల్ రైట్స్ అమ్మేసారు. ఒక వేళ టర్మ్స్ మార్చుకుందామనుకున్నా, హీరో వైష్ణవ్ తేజ్ కుటుంబం అంతగా ఇష్టపడడం లేదు. హీరో తొలిసినిమా థియేటర్లో విడుదల అయితేనే బెటర్ అని వారి భావన. 

రామ్ రెడ్ సినిమా అన్ని విధాలా రెడీగా వుంది కానీ డీల్ సెట్ కావడం లేదు. ఎందుకంటే ఈ సినిమా మీద నిర్మాత స్రవంతి రవికిషోర్ చాలా భారీ లాభాలు ఆశించారు. తక్కువలో తీసారు. ఇస్మార్ట్ శంకర్ నేఫథ్యంలో థియేటర్, నాన్ థియేటర్ కలిసి గట్టిగా లాగాలనుకున్నారు. ఇప్పుడు ఓటిటికి వెళ్తే ఆ రేంజ్ రమ్మన్నా రాదు. అందుకే ముందు వెనుక ఆడుతున్నారు.

రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా  క్రాక్ కు ఇంకా పది హేను రోజుల షూటింగ్ పార్ట్ బకాయి వుంది. అన్ని విధాలా అనుకూల పరిస్థితులు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పటికి థియేటర్లు కూడా రెడీ అయిపోవచ్చు. అందువల్ల ఇది ఓటిటికి రావడం అసాధ్యం కావచ్చు. 

ఇక మిగిలిన మీడియం, అబౌవ్ మీడియం సినిమాలు అన్నీ చాలా వర్క్ పెండింగ్ లో వున్నవే. అందువల్ల ఓటిటికి అవకాశం తక్కువ. అందువల్ల తెలుగులో ఓటిటి ప్లాట్ ఫారమ్ మీదకు అబౌవ్ మీడియం, భారీ సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి.

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

Show comments