మహేష్ బాబు డైలీ డైరీ

మహేష్ ఫ్యాన్స్ కు రోజూ పండగే పండగ. లాక్ డౌన్ టైమ్ లో తమ అభిమాన హీరో ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కిందా మీదా పడక్కరలేదు. రోజూ ఏ నిమిషానికి ఆ నిమిషం అప్ డేట్ ఆయనే పోస్ట్ చేస్తారు ఇన్ స్టా గ్రామ్ లో. ఆ వెంటనే ట్విట్టర్ లో. అక్కడి వరకు మహేష్ బాబు పని. ఇన్ స్టా, ట్విట్టర్ అనేవి పర్సనల్ వ్యవహారాలు, అభిప్రాయాలు షేర్ చేసుకోవడమే. అందువల్ల ఆయన చేస్తున్నది కరెక్ట్ నే. 

కానీ అక్కడి నుంచి అసలు కథ మొదలువుతుంది. ఆపైన ఆయన పీఆర్ టీమ్ వుండనే వుంటుంది. ట్విటర్ చూడరేమో, ఇన్ స్టాలో ఫాలో కారేమో అనే భయంతో,అనుమానంతో ఆ లింకులు తీసుకువచ్చి టోటల్ జర్నలిస్ట్ లు అందరికీ పంచడానికి.  ఈ రోజు బాబు హైట్ కొలిచారు. ఈరోజు పాప ముచ్చటైన చిలకపలుకులు పలికింది. ఇప్పుడే స్నానం చేసాము. ఇప్పుడే ఈత కొట్టాము. ఇలా అప్ డేట్ లే అప్ డేట్లు ఈ టీమ్ ప్రచారం సాగిస్తుంది. 

ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇన్ స్టా అన్నది హీరోల పర్సనల్ వ్యవహారం. వారిని ఫాలో అయ్యేవారు కావచ్చు. అభిమానులు చూసి సరదా పడొచ్చు. అది వారి వారి పర్సనల్.  కానీ ఈ అప్ డేట్ పోస్టుల ఇన్ స్టా, ట్విట్టర్ లింకులు అన్నీ ప్రపంచానికి ప్రచారం చేయాలని అనుకోవడం ఏమిటో?  నిజానికి ఇదే పీఆర్ టీమ్ కూడా తెల్లారి లేస్తుంది. స్నానాలు చేస్తుంది, పిల్లలతో ముచ్చట్లు వేసుకుంటుంది...కానీ ఆ ముచ్చట్లు మరిచి, ఈ ముచ్చట్లను మోసుకుంటూ, ఇన్ స్టా, ట్విట్టర్ లింక్ లు ప్రచారం చేస్తుంది అని అప్ డేట్ పెట్టుకోవాలేమో? 

దాదాపు మరో రెండు మూడు నెలల దాకా షూటింగ్ లు వుండవంటున్నారు. పీఆర్ టీమ్ కు చేతినిండా పనే. కానీ ఈ విషయంలో మిగిలిన హీరోలు చాలా అంటే చాలా వెనుకబడి వున్నారు పాపం, ఎప్పుడో అమావాస్యకు పున్నమికి తప్ప ఇంటి ముచ్చట్లు ప్రచారం కావట్లేదు. 

కాపులను దారుణంగా మోసం చేసింది ఎవరో అందరికంటే పవన్ కళ్యాణ్ కే బాగా తెలుసు

నాయకుడంటే అర్థం తెలిసింది

Show comments