థియేటర్ల సీట్లు తగ్గింపు కుదరని పని?

నిన్నటికి నిన్న హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చలామణీ అయ్యాయి. సీటు కు సీటుకు మధ్య ఓ సీటు వుండేలా మార్పు చేసినట్లు చూపించే ఫొటోలు అవి. ఇలా చేస్తే థియేటర్ల వ్యాపారం కిట్టుబాటు అవుతుందా? రేట్లు పెంచితే జనాలు వస్తారా? ఇలాంటి అనుమానాలు టాలీవుడ్ లో వినిపించాయి. అయితే విషయం ఏమిటంటే చాలా మంది ఎగ్జిబిటర్లు ఈ సీట్లు కుదింపు వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

కావాలంటే కొన్నాళ్లు ఆలస్యంగానైనా థియేటర్లు తెరుస్తాము కానీ, ఇలా సీట్లు తగ్గిస్తే ఖర్చులు కూడా కిట్టుబాటు కావని అంటున్నారట. కావాలంటే థెర్మల్ టెంపరేచర్ చెకింగ్, క్యూ లైన్లు, ఎంట్రీ లైన్ల దగ్గర సోషల్ డిస్టాన్స్ వంటివి జాగ్రత్తగా పాటిస్తామని, అలాగే షో కి షో కి మధ్య థియేటర్ సీట్లు శానిటేషన్ వంటివి చూస్తామని, అంతే తప్ప, సీట్లు కుదింపు అంటే కుదరని పని అని చెబుతున్నారు.

కరెంట్ బిల్లులు, జీతాలు, లీజు మొత్తాలు ఇవన్నీ కలిసి ఇప్పటికే థియేటర్ల వ్యాపారాన్ని నష్టాల్లోకి నెట్టాయని, దీనికి తోడు సగం సీట్లు తీసేయడం అంటే ఇక థియేటర్ల వ్యాపారమే అనవసరం అని, అందుకే నడిపితే ఇప్పటి మాదిరిగా నడపడం, లేదూ అంటే మూసి పెట్టుకోవడం తప్పమరో మార్గం లేదని చాలా మంది ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

Show comments