సాయాన్ని అర్తిస్తున్న లారెన్స్‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు లారెన్స్ సాయాన్ని అర్తిస్తున్నాడు. అయితే అది త‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు మాత్రం కాదు. అనాథ‌ల‌ను ఆదుకోవాల‌ని దాత‌ల నుంచి ఆయ‌న సాయం కోరుతున్నారు. చెన్నైలో లారెన్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అనాథ శ‌ర‌ణాల‌యాన్ని నడుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా స‌మాజంలో దుర్భ‌ర ప‌రిస్థితులు నెల‌కున్నాయి.

పేద‌లు, అనాథ‌ల‌ను ఆదుకునేందుకు లారెన్స్ త‌న శ‌క్తి మేర‌కు సాయం అందిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ మ‌రోసారి పొడిగించ‌డంతో  అనేక అనాథాశ్ర‌మాల్లో ఉండే పిల్ల‌ల‌కు అండ‌గా ఉండ‌నున్న‌ట్టు లారెన్స్ ప్ర‌క‌టించారు. అయితే అనాథాశ్ర‌మాల్లో ఉన్న పిల్ల‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌న్నారు. ఇలాంటి క‌ష్ట కాలంలో అనాథాశ్ర‌మాల్లోని పిల్ల‌ల‌కు సాయం అందించేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...

"చాలా మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా అనాథపిల్లలు. నాకు ఆకలితో పాటు ఆహారం విలువ తెలుసు. ఈ క్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ సూర్యకళతో కలిసి పిల్లల సంరక్షణకి తగిన‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లల కోసం నిత్యావసరాలు సరఫరా చేసిన ఆమెకి ధన్యవాదాలు. కొంత సాయం అయిన చాలా మంది ఆకలి తీరుస్తుంది" అని లారెన్స్ తన ట్వీట్‌లో తెలిపారు.   

250 నుంచి 20 కేజీలు తగ్గితే అదో వింతా ?

Show comments