స‌మంత‌కు రష్మిక ముద్దులు, కౌగిలింత‌లు!

స‌మంత నుంచి కాస్త పొగ‌డ్త‌ వినిపించే స‌రికి చాలా ఆనంద‌ప‌డిన‌ట్టుగా ఉంది ర‌ష్మిక‌. త‌న ఫాలోయ‌ర్స్ తో ఇన్ స్టాగ్ర‌మ్ చాట్ లో ర‌ష్మిక విష‌యంలో స్పందించింది స‌మంత‌. ఈ మ‌ధ్య కాలంలో ఒక సెల‌బ్రిటీ త‌న ఫాలోయ‌ర్ల‌తో చాట్ చేస్తే, స‌ద‌రు ఫ్యాన్స్ వేరొక సెల‌బ్రిటీ గురించి అడ‌గ‌డం రొటీన్ అయిపోయింది. ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన వారి గురించి స్పందించ‌మ‌ని సెల‌బ్రిటీల‌ను కోరుతూ ఉంటారు. 

ఈ క్ర‌మంలో స‌మంత ఇన్ స్టా చాటింగ్ లో ర‌ష్మిక ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు ఒక అభిమాని. ర‌ష్మిక విష‌యంలో స్పందించాల‌ని కోరాడు. దీనిపై స‌మంత రియాక్ట్ అవుతూ.. ఆమె హార్డ్ వ‌ర్క‌ర్ అని, ప్ర‌త్యేకించి డ్యాన్సులు, స్టెప్పుల విష‌యంలో ర‌ష్మిక బాగా క‌ష్ట‌ప‌డుతోందంటూ కితాబిచ్చింది స‌మంత‌!

ఈ రిప్లై ఆ ఫాలోయ‌ర్ ను ఎంత వ‌ర‌కూ ఆనంద‌పెట్టిందో కానీ, ర‌ష్మిక‌ను మాత్రం చాలా సంతోష పెట్టింది. దీనిపై ఆమె స్పందించింది. స‌మంత రిప్లైను షేర్ చేసుకుంటూ.. ముద్దుల‌, కౌగిలింత‌ల ఇమోజీల‌ను పోస్టు చేసింది ర‌ష్మిక‌. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ అయిన స‌మంత కితాబుకు ర‌ష్మిక ఆనంద‌ప‌డిన‌ట్టుగా ఉంది.

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments