ఒకే రోజు 8వేల కేసులు.. పరిస్థితి చేజారుతోంది!

రోజుకు 6వేల కేసులొస్తే అదే హయ్యస్ట్ అనుకున్నాం. గడిచిన 3 రోజుల నుంచి 7వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆగుతుందనుకున్నాం. కానీ ఈసారి ఏకంగా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అవును.. గడిచిన 24 గంటల్లో భారత్ లో అక్షరాలా 8380 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 182,143కు చేరుకుంది.

అటు కరోనా మృతుల సంఖ్య కూడా ఇండియాలో 5వేలు దాటింది. నిన్న ఒక్క రోజే కరోనా వల్ల 193 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5164కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 87 వేల మంది కరోనా నుంచి కోలుకోగా... 90వేల మంది చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులపరంగా ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది భారత్. మరో 24 గంటల్లో 8వ స్థానానికి ఎగబాకడం ఖాయం. ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న జర్మనీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి రేపటికి 8వ స్థానానికి చేరడం ఖాయం.

ఇవాళ్టితో లాక్ డౌన్ ముగుస్తోంది. రేపట్నుంచి మరిన్ని మినహాయింపులు ఉండబోతున్నాయి. ఇక 8వ తేదీ నుంచి మాల్స్, ప్రార్థనా స్థలాలు కూడా తెరవబోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. నిపుణులు చెబుతున్న విశ్లేషణల ప్రకారం.. జూన్ చివరినాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకొని, అక్కడ్నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌

Show comments