అచ్చెన్న పొలిటికల్ కామెడీకి సీరియస్ రియాక్షన్

అచ్చెన్నాయుడు మహానాడు పుణ్యమాని జామ్ యాప్ లో కనిపించి క్యాడర్ కి కనువిందు చేశారని ఓ వైపు సెటైర్లు పడుతున్నాయి. కరోనా టైంలో అచ్చెన్న ఎక్కడ ఉన్నాడు అని తమ్ముళ్ళే వెతుక్కున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక అచ్చెన్న మహానాడులో తనదైన విమర్శలకు పదును పెడుతూ అధినేతను సంతోషపెట్టాలని చూశారు.

అది అలా ఉంటే వైసీపీ సర్కార్ పధకాలు కేవలం ఆ పార్టీ వారికే అందుతున్నాయని అచ్చెన్న పెద్ద బండ వేసేశారు. ఎనీ టైం ఎనీ ప్లేస్ నేను రెడీ నిరూపిస్తానంటూ ఆవేశంతో ఊగారు.

సరే ఇపుడు ఆయన సవాల్ కి మేము రెడీ అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి, అచ్చెన్నా కరోనా వేళ కనిపించకుండ మీరు  ఎక్కడ ఉన్నారని కూడా ఆమె నిలదీశారు. అంతే కాదు, అచ్చెన్నా మీసొంత గ్రామం నిమ్మాడలో ప్రభుత్వ పధకాలు తెలుగుదేశం వారికి అందాయా లేదా చూద్దాం వస్తారా అంటూ అమె గట్టిగానే తగులుకున్నారు.

నిమ్మాడ పూర్తిగా టీడీపీ గ్రామం. అక్కడ వైసీపీకి ఓట్లు కూడా రాలేదు, కానీ అమ్మ ఒడి, రైతు భరోసా సహా అనేక పధకాలు అమలు అవుతున్నాయి. పెద్ద ఎత్తున  లబ్దిదారులు ఉన్నారు. కాదని చెప్పగలరా అచ్చెన్నా అంటూ ఆమె చేసిన సవాల్ కి మరి మాజీ మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో.

అయినా పచ్చ కామెర్ల రోగికి అంతా అలాగే కనిపిస్తుందని  వైసీపీ నేతలు అంటున్నారు.  టీడీపీలో తాము అలాగే చేసి ఆఖరుకు తిత్లీ  తుఫాన్ సాయం కూడా పచ్చ కార్యకర్తలకే పంచిపెట్టిన చందంగా ఇతరులు అలాగే చేస్తారనుకుంటే తప్పు అచ్చెన్నా అంటున్నారు.  మరి అచ్చెన్నా సీరియస్ గా ఈ సవాల్ స్వీకరిస్తే బెటరెమో.

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments