అగ్ర‌హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

లాక్‌డౌన్ వేళ షూటింగ్‌లు బంద్ కావ‌డంతో సినీ సెల‌బ్రిటీలు అభిమానుల‌కు మాత్రం వినోదాన్ని పంచ‌డం మాన‌లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు, నెటిజ‌న్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటున్నారు. వాళ్ల చిలిపి ప్ర‌శ్న‌ల‌కు కొంటె స‌మాధానాలిస్తూ క‌వ్విస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అగ్ర‌హీరోయిన్ , బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట‌ర్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పాటు నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకున్నారు. కానీ పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావ‌డం ఆమె అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల సినీ సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్లు త‌ర‌చూ హ్యాక్ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాం శమ‌వుతోంది.

ఇప్పుడు పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యే వంతు వ‌చ్చిన‌ట్టుంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పూజా పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. హ్యాక్ అయిన కొంత సేప‌టికే డిజిట‌ల్ టీం సాయంతో త‌న అకౌంట్‌ను పున‌రుద్ధ‌రించిన‌ట్టు పూజా హెగ్డే మ‌ళ్లీ ట్వీట్ చేశారు. దీంతో హ్యాక్ స‌మ‌యంలో  ఉన్న పోస్ట్‌లు, మెస్సేజ్‌లని తొలగించినట్టు పూజా వెల్ల‌డించారు. కానీ హ్యాక్‌ల‌ను శాశ్వ‌తంగా అరిక‌ట్టేందుకు సాధ్యాసాధ్యాల‌పై ఆ రంగంలో నిపుణులైన వారు సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సి ఉంది. 

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments