టైటిల్ నా? వర్కింగ్ టైటిల్ నా?

తినగ తినగ వేము తియ్యనుండు అన్న నానుడి సినిమా టైటిళ్లకు కూడా వర్తిస్తుంది. టైటిల్ పెట్టినపుడు ఏమో అనిపిస్తుంది. తరువాత తరువాత వినగా వినగా, ఇది కదా టైటిల్ అనిపిస్తుంది. అత్డారింటికి దారేది నుంచి అ..ఆ మీదుగా అల వైకుంఠపురములో వరకు టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ విధమైన ట్రెండ్ సెట్ చేసారు. ఇప్పుడు మిగిలిన వారు ఇదే ఫాలో..ఫాలో అంటున్నారు.

నిన్నటికి నిన్న కొత్త టైటిల్ వినిపించింది. అది కూడా హీరో మహేష్ బాబు సినిమాకు. సర్కారువారి పాట. ఇదీ టైటిల్. బ్యాంకు లకు టోపీ పెట్టి, తన తల్లిని ఇబ్బంది పెట్టిన వాడి చేత మళ్లీ డబ్బు వెనక్క ఎలా కట్టించాడు హీరో అన్నది లైన్ అని ఇప్పటికే బయటకు వచ్చింది. ఆ లెక్కలో ఈ టైటిల్ పెర్ ఫెక్ట్ అని అందరూ అనుకున్నారు.

కానీ ఇంతకీ మహేష్ సినిమాకు ఇదే టైటిల్ నా? లేదా ఇది వర్కింగ్ టైటిల్ నా? అన్న డిస్కషన్లు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ కు ఫ్యాన్స్ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. అయితే మహేష్ బాబు సినిమా కనుక, ఇంకా కాస్త క్యాచీ టైటిల్ వుంటే బాగుంటుంది అన్న కామెంట్లు కూడా వినిపించాయి. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో మొన్నే సినిమా చేసారు. అందువల్ల సర్కారువారి పాట టైటిల్ కూడా మహేష్ ఓకె చేసే వుంటారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ గా వుంచుతారని, సరైన టైటిల్ దొరికితే సరే, లేదంటే ఇదే టైటిల్ అవుతుందని అంటున్నారు. పరుశురామ్ మంచి టైటిళ్లు పెడతారు. గీత గోవిందం, శ్రీరస్తు శుభమస్తు, సోలో, సారొచ్చారు ఇలాంటి టైటిళ్లు అన్నీ ఆయనవే. అందువల్ల ఆయన ఈ 'సర్కారువారి పాట' టైటిల్ తో పాటు మరో టైటిల్ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తారేమో అనుకోవాలి.

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments