ఆ రీమేక్ కు అఖిల్ నో చెప్పాడా?

ఓ మై కడవులే..ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో విడుదలై మంచి ప్రశంసలు, మంచి కలెక్షన్లు దక్కించుకున్న సినిమా. ఈ సినిమా తెలుగు భాష రీమేక్ హక్కులను దక్కించుకున్నారు నిర్మాత పివిపి. తెలుగుకే కాదు, మరి కొన్ని భాషల హక్కులు కూడా ఆయనవే. మంచి ప్రాజెక్టు దొరికింది. మంచి సినిమా అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే పివిపి మాత్రం తొందరపడడం లేదు.  

ఇదిలా వుంటే ఇండస్ట్రీలో వున్నట్లుండి ఓ గ్యాసిప్ వినిపించడం ప్రారంభమైంది. ఈ సినిమా చేస్తారా? అని నిర్మాత హీరో అఖిల్ ను అప్రోచ్ అయ్యారని, కానీ అఖిల్ ఈ సబ్జెక్ట్ పట్ల అంత ఆసక్తిచూపించలేదన్నది ఆ గ్యాసిప్. ఓ మై కడవలే సబ్జెక్ట్ ఈ జనరేషన్ యువత మనో భావాలకు అద్దం పట్టేలా వుంటుంది. మరి అఖిల్ ఎందుకు నో చెప్పాడో అన్నది తెలియదు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, బ్రేకప్ లు, డైవోర్స్ ఇలాంటి వ్యవహారాలు, గతంలో చేసిన మిస్టర్ మజ్ఞుకు దగ్గరగా వుంటాయని ఏమన్నా అనుకున్నాడేమో?

మరి ఈ కథ ఎవరికి నచ్చుతుందో? నిజానికి చైతూ కు కూడా బాగానే సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు చైతూ తో సహా అందరు యంగ్ హీరోలు మూడు నాలుగు ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. 

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments