స‌హ‌జీవ‌నం..ప్ర‌‌ముఖ సినిమాటోగ్రఫ‌ర్ పై న‌టి ఫిర్యాదు!

టాలీవుడ్ ప్ర‌ముఖ సినిమాటోగ్ర‌ఫ‌ర్ శ్యామ్ కే నాయుడుపై ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలిస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శ్యామ్ త‌న‌ను మోసం చేశాడ‌ని, పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేస్తున్నాడ‌ని అంటూ స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ కంప్లైంట్ చేసిన‌ట్టుగా స‌మాచారం. తామిద్ద‌రం ఆరు నెల‌ల పాటు స‌హ‌జీవ‌నం చేసిన‌ట్టుగా కూడా ఆమె పేర్కొంద‌ట‌. అయితే ఆమె ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు అయితే చేసింది, ఈ వ్య‌వ‌హారంపై పూర్వాప‌ర వివ‌రాల‌ను అడుగుతున్నార‌ట‌ పోలీసులు.

పోకిరి, ర‌భ‌స‌, డిక్టేట‌ర్ వంటి సినిమాల‌కు సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌ని చేశారు శ్యామ్ కే నాయుడు. ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీలో పేరున్న టెక్నీషియ‌న్ అయ్యారు. త‌న‌ను పెళ్లి చేసుకునే విష‌యంలో శ్యామ్ ప్రామిస్ చేశాడ‌ని, త‌న‌ను అత‌డు ఎక్స్ ప్లోయిట్ చేశాడ‌ని స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టు ఆరోపిస్తూ ఉంది. కొంత‌కాలం తాము క‌లిసి ఉన్నాకా, ఇప్పుడు అత‌డు మోసం చేశాడ‌ని ఆమె అంటోంది. 

ఈ విష‌యంలో శ్యామ్ కే నాయుడును పోలీసులు ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మేర‌కు అత‌డిని పిలించుకున్నార‌‌ట పోలీసులు. విచారిస్తున్న‌ట్టుగా పోలీసులు ప్ర‌క‌టించారు. వారిద్ద‌రూ పోలీసుల‌కు అందుబాటులోకి వ‌చ్చార‌ట‌. ఇద్ద‌రినీ క‌లిపి మాట్లాడుతూ ఉన్న‌ట్టుగా, వారిద్ద‌రూ సెటిల్ మెంట్ కు రాని ప‌క్షంలో ఈ వ్య‌వ‌హారంపై ఐపీసీ సెక్ష‌న్ 493 ప్ర‌కారం శ్యామ్ కే నాయుడుపై కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు.

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments