చంద్ర‌బాబు పై లాక్ డౌన్ కేసు త‌ప్ప‌దా?

హైద‌రాబాద్ నుంచి ఏపీకి వెళ్లి విజ‌య‌యాత్ర చేసిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుపై కూడా లాక్ డౌన్ కేసు న‌మోదయిన‌ట్టేనా? ఈ విష‌యంలో హై కోర్టుకు ఫిర్యాదు చేశారు లాయ‌ర్లు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా, చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌యాత్ర త‌ర‌హాలో చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరుపై వారు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదు మేర‌కు చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేయ‌డానికి కోర్టు ఆదేశించ‌లేదు.

ఈ విష‌యంలో కోర్టు ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న వేసింది. చంద్ర‌బాబుపై డైరెక్టుగా హై కోర్టుకు ఎందుకు వ‌చ్చారా? స్థానికంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారా? అని పిటిష‌న‌ర్ల‌ను కోర్టు అడిగిన‌ట్టుగా స‌మాచారం. అయితే ఇలాంటి ఫిర్యాదుల‌ను ఇది వ‌ర‌కూ కోర్టు డైరెక్టుగా తీసుకుంద‌ని పిటిష‌న‌ర్లు ప్ర‌స్తావించార‌ట‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సేవా కార్య‌క్ర‌మాల‌కు వెళ్లిన స‌మ‌యంలో వారు లాక్ డౌన్ ను ఉల్లంఘించార‌ని స్థానికంగా ఫిర్యాదులు ఏమీ లేక‌పోయినా, డైరెక్టుగా హై కోర్టులో ఫిర్యాదులు చేయ‌డం, ఏకంగా సీబీఐ విచార‌ణ విన్న‌పాలు రావ‌డం తెలిసిన సంగ‌తే.

ఈ  విష‌యాన్నే చంద్ర‌బాబుపై పిటిష‌న్ లు వేసిన వారు కూడా ప్ర‌స్తావించార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఈ పిటిష‌న్ ను విచారించ‌డానికి కోర్టు స్వీక‌రించిందని స‌మాచారం. లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌ల విష‌యంలో దాఖ‌లైన ఇత‌ర పిటిష‌న్ల‌తో పాటు చంద్ర‌బాబుపై దాఖ‌లైన పిటిష‌న్ ను కూడా హై కోర్టు క‌లిపి విచారించ‌బోతోంద‌ని స‌మాచారం. ఆ త‌ర‌హా ఫిర్యాదుల‌ను ఎదుర్కొంటున్న వారిలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంద‌రి పిటిష‌న్లనూ కోర్టు జాయింటుగా విచారించ‌నుంద‌ట‌. ఈ సీరియ‌ల్ త‌రువారి ఎపిసోడ్ కూడా ఆస‌క్తిదాయ‌క‌మే.

సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు

Show comments