లారెన్స్ ఫౌండేష‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం

ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు, సినీ న‌టుడు లారెన్స్ ఫౌండేష‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న క‌రోనా రోజురోజుకూ పెర‌గ‌డ‌మే త‌ప్ప ఏ మాత్రం ప్ర‌జ‌ల‌కు మ‌న‌శ్శాంతినివ్వ‌డం లేదు. పేద‌. ధ‌నిక‌, చిన్నాపెద్దా, ఆడ‌మ‌గ అనే తేడా లేకుండా క‌రోనా వైర‌స్ ప్ర‌తి ఒక్క‌రిపై క‌రోనా ప్ర‌తాపం చూపుతోంది.

త‌మిళ‌నాడులో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. లారెన్స్ ఫౌండేష‌న్‌లో 21 మంది క‌రో్నా బారిన ప‌డ్డ‌ట్టు తేలింది. వీరిలో 18 మంది పిల్ల‌లు, ముగ్గురు ఉద్యోగులున్నారు. క‌రోనా ప‌రీక్ష‌ల్లో వీరంద‌రికీ పాజిటీవ్ అని తేల‌డంతో ఆందోళ‌న నెల‌కొంది. క‌రోనా బారిన ప‌డిన వారంద‌రినీ చెన్నైలోని ల‌యోలా కాలేజీ వైద్య శిబిరానికి త‌ర‌లించారు.

బాధితులందరూ ఆరోగ్యంగా ఉన్నారని  ఫౌండేష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ట్రస్ట్  స‌భ్యుల‌ని కూడా పరీక్షించే అవకా శాలున్నాయి.  లారెన్స్ కొన్ని రోజులుగా ‌ అనాథలు, దివ్యాంగుల కోసం  చెన్నై అశోక్‌నగర్‌లో  ‌త‌న‌ ట్రస్ట్‌ ద్వారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనాథ‌ల కోసం ప‌రిత‌పించే లారెన్స్ ఫౌండేష‌న్‌లోని పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆవేద‌న‌కు గురి చేస్తోంది. త్వ‌ర‌గా వారంతా కోలుకోవాల‌ని ప్రార్థిద్దాం.

సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు

Show comments