అధికారం మత్తు దిగని కూన తమ్ముడు

అదేంటో తెలుగుదేశం పార్టీకి ఇంకా తాము అధికారంలోనే ఉన్నామన్న భ్రమలు చాలా ఉన్నాయి. అధినేత చంద్రబాబు నుంచి తమ్ముళ్ళ వరకూ అదే కధ. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ లో కూర్చుకుని చంద్రబాబు అందరికీ లేఖలు రాయడం, జూం వీడియో సమావేశాలు పెట్టి  సమీక్షలు చేయడం చూసిన వారు బాబు ఇంకా సీఎం అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు.

ఆయన బాటలో నూటికి వేయి శాతం నడిచే తమ్ముళ్ళదీ అదే తంతు. అందుకే పదే పదే రెచ్చిపోతున్నారు. అధికారం మత్తు దిగని వేళ వెర్రి కేకలు వేస్తున్నారు, ప్రభుత్వ అధికారుల మీదే జులుం చేస్తూ మంద బలం చూపిస్తున్నారు.

ఇలాంటివి చేయడంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందు వరసలో ఉన్నాడు. ఇప్పటికే అధికారుల మీద దురుసుగా ప్రవర్తించాడని రెండు ఘటనల్లో అరెస్ట్ అయి బెయిల్ మెద ఉన్న కూన తన పాత బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు.

తాజాగా పొందూరు తాశీల్దార్ మీద తన ప్రతాపం చూపించాడు. ఇంతకీ ఆ అధికారి చేసిన తప్పు ఏంటి అంటే కూన సోదరుడు అక్రమంగా ఇసుక తరలించుకుపోతూంటే అడ్డుకోవడం, వారి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించడం. ఒక తప్పు చేసి కూడా ప్రభుత్వ అధికారి మీద నోరు పారేసుకోవడమే కాదు, అసభ్య పదజాలాంతో ఫోన్ లో దూషించిన కూన దాష్టికాలు ఆడియో సాక్షిగా భద్రంగానే రికార్డు అయ్యాయి.

సరే కూన ఇలా తన ప్రతాపం చూపిస్తూ రెచ్చిపోతూంటే ఏడాదిగా అధికారంలో ఉన్న వైసీపీ  పెద్దలు ఏంచేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. అధికారులకు రక్షణగా నిలిచి ఇకనైనా కూన లాంటి వారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి దాష్టికాలు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వైసీపీ సర్కార్ దే. లేకపోతే కూన లాంటి  తమ్ముళ్ళు మరింతమంది అధికారం ఉన్మాదంతో రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

Show comments