'V' మూవీ వాయిదా పడడం హ్యాపీగా ఉంది

ఈ మాట అంటోంది ఎవరో కాదు. స్వయంగా ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతున్న మాటిది. లాక్ డౌన్ కారణంగా తమ సినిమా వాయిదాపడడం ఒక విధంగా మంచిదే అయిందంటున్నాడు ఇంద్రగంటి. దీనికి ఆయన చెప్పే లాజిక్ కూడా సహేతుకంగా ఉంది.

'V' మూవీ విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు లాక్ డౌన్ పడింది. అదే సినిమా థియేటర్లలోకి వచ్చిన 2-3 రోజులకు లాక్ డౌన్ పడినట్టయితే పరిస్థితి దారుణంగా ఉండేదని చెబుతున్నాడు ఇంద్రగంటి. మూవీకి హిట్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లు మూతపడతాయి కాబట్టి సినిమా ఆడే పరిస్థితి ఉండేది కాదని, ఈలోగా పైరసీ కూడా జరిగి అపార నష్టం వచ్చి ఉండేదని చెబుతున్నాడు.

సరిగ్గా సినిమా విడుదలకు ముందు లాక్ డౌన్ పడడం నిజంగా తమ అదృష్టం అంటున్నాడు ఇంద్రగంటి. నాని కెరీర్ లో 25వ సినిమా ఇది. పైగా నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. ఇలా తమకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టాలనే ప్రతిపాదనను ఇంద్రగంటి వ్యతిరేకిస్తున్నాడు. తమ సినిమాను థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు అంటున్నాడు.

లాక్ డౌన్ ప్రారంభానికి వారం ముందే తను ఇంటికి పరిమితమయ్యానని చెబుతున్నాడు ఇంద్రగంటి. V సినిమాకు సంబంధించి వర్క్ అంతా పూర్తయిందని, ఇంకొక్కసారి డబుల్ చెక్ చేసుకుంటే సరిపోతుందని స్పష్టంచేశాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో మరో 3 కొత్త స్క్రిప్టులకు మెరుగులు దిద్దానని చెబుతున్న ఈ దర్శకుడు.. V సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తానంటున్నాడు.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

Show comments