అన‌సూయ‌కు నెటిజ‌న్ చిలిపి ప్ర‌శ్న‌

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు బంద్ అయిన‌ప్ప‌టికీ...సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ‌. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో క‌బుర్లు చెప్పారు. "బోర్‌గా ఫీల్ అవుతున్నా. మీ ప్ర‌శ్న‌లు, ప్రేమాభిమానాలతో న‌న్ను ఉత్తేజ‌ప‌ర‌చండి" అని ఆమె అభిమానుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు, నెటిజ‌న్ల‌తో చిట్‌ చాట్ చేశారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం....

స్వ‌తంత్రంగా రాణిస్తూ చాలా మంది అమ్మాయిల‌కు స్ఫూర్తిగా నిలిచారు... ఎలా రాణిస్తున్నార‌నే ప్ర‌శ్న‌కు అన‌సూయ స్పందిస్తూ విలువ‌ల కోసం ఎక్క‌డా రాజీప‌డ‌లేద‌న్నారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్న‌ట్టు తెలిపారు. ఎప్పుడైనా ఎవ‌రికి వారు ప్రేమించుకోవ‌డం ముఖ్య‌మైంద‌న్నారు.

లాక్‌డౌన్ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డే స‌ల‌హాలు ఇవ్వాల‌ని ఒక‌రు అడిగారు. దానిపై అన‌సూయ స్పందిస్తూ ఆ విష‌యంలో ఐడియాల కొర‌త ఏర్ప‌డింద‌న్నారు. అందుకోసమే ఈ చిట్‌చాట్ అని చెప్పుకొచ్చారు. మీకేమైనా ఐడియాలు వ‌స్తే త‌న‌కు చెప్పాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.

మీ లాంటి అమ్మాయి త‌న‌కు ల‌వ‌ర్‌గా రావాల‌ని దీవించాల‌ని ఓ నెటిజ‌న్ చిలిపి ప్ర‌శ్న వేశాడు. దానిపై అన‌సూయ మాట్లాడుతూ త‌న‌లాంటి అమ్మాయి ల‌వ‌ర్‌గా రావ‌డం కొంచెం క‌ష్ట‌మ‌న్నారు. ఎందుకంటే త‌నో సింగిల్ పీస్ అని అన్నారు. మంచి అమ్మాయి, కొంచెం త‌న‌లాంటి అమ్మాయి రావాల‌ని ఆశిస్తున్న‌ట్టు నెటిజ‌న్‌ను నిరాశ ప‌ర‌చ‌కుండా స‌మాధానం ఇచ్చారు.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments