తెలంగాణ చాంబర్ ను సైడ్ లైన్ చేసారా?

తెలంగాణ మొత్తం మీద నాలుగువందలకు పైగా థియేటర్లు వున్నాయి. ఈ థియేటర్లు అన్నీ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ కు అనుబంధంగా వున్నాయి. మరి తెలంగాణలో థియేటర్ల సమస్య గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులే కదా? మరి వాళ్లను సంప్రదించకుండా, వాళ్లను పిలవకుండా, ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను పట్టించుకోకుండా, మెగాస్టార్ చిరంజీవి తనకు నచ్చిన వాళ్లను తీసుకుని వెళ్లి సిఎమ్ ను కలవడం ఏమిటి?''

ఇది మా ప్రశ్న కాదు. టాలీవుడ్ లో యాక్టివ్ గానే వున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఫ్రశ్న. తెలంగాణ చాంబర్ కు అనుబంధంగా నాలుగు సెక్టార్లు వుంటాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలు, థియేటర్లు ఈ నాలుగు సెక్టార్లలోని ప్రతినిధులను ఎవరైనా పిలిచారా...ఇది మరో ప్రశ్న.

తెలంగాణలో అత్యధికంగా థియేటర్లు కలిగి, నిర్మాణరంగంలోకి అడుగు పెట్టిన ఆసియన్ సునీల్ ను పిలవలేదని, తను సినిమాలు తీస్తున్నా, పంపిణీ చేస్తున్నా, తనను పిలవలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. ఇలా తననే కాదు, ఇంకా చాలా మంది కీలకమైన వారిని పిలవలేదని, అసలు ఎవర్ని పిలిచారో? వాళ్ల క్రెటీరియా ఏమిటో? అర్థం కావడం లేదని ఆయన అన్నారు. 

సిఎమ్ దగ్గరకు డెలిగేట్స్ గా వెళ్లిన వారిలో ఓ డైరక్టర్ సినిమా తీసి ఎన్భాళ్లు అయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ చాంబర్ నే కాదు, తమకు తెలిసినంత వరకు తెలుగు ఫిలిం చాంబర్ ను కూడా దాదాపు పక్కన పెట్టారని ఇణడస్ట్రీ అంతా ఒక తాటిపైకి రావాలి. ఒక్కటిగా వుండాలి అని కోరుకునే వారు ఇలా చేయడం సబబా? అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణకు చెందిన ఓ హీరో తండ్రి కమ్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ను కూడా పిలవలేదని ఆయన అన్నారు.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments