నాని సినిమాకు తెలంగాణ నేపథ్యం

కొత్త దర్వకుడు శ్రీకాంత్ డైరక్షన్ లో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించే సినిమాలో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా నేటివ్ సినిమాగా ఇది రూపొందబోతోందని గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ ఫో ఏమిటంటే,  ఈ సినిమాకు గోదావరి ఖని నేపథ్యం అంట. పక్కా తెలంగాణ పల్లెల నేపథ్యంలో సాగే ఈ కథ రంగస్థలం, పలాస మాదిరిలుగా కాస్త నాటుగానే వుంటుంది. కొంచెం రజాకార్ల ఉద్యమ నేఫథ్యం కూడా వుంటుందని వినిపిస్తోంది.

నాని ఈ కథను ఎప్పుడో ఓకె చేసి పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎప్పుడయితే  సింఘ రాయ్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం వుందని వినిపిస్తోందో, దీన్ని పట్టాలెక్కిస్తారని వినిపిస్తోంది. సింఘ రాయ్ సినిమాకు కలకత్తా నేఫథ్యం అవసరం. కలకత్తాలో ఇప్పట్లో సినిమా తీసే పరిస్థితులు నెలకొంటాయా? అన్నది అనుమానం. అందుకే ఈ లోగా ఈ సిన్మా స్టార్ట్ చేసే అవకాశం వుందని వినిపిస్తోంది.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments