ట్రేడ్ టాక్: డైరెక్ట్ ఓటీటీకి లైన్ క్లియర్

పరిమిత బృందంతో షూటింగ్స్ చేసుకోవడానికి, అలాగే పూర్తయిన సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరుతూ చిత్ర సీమ ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని, జూన్ రెండవ వారం నుంచి మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయని చెబుతున్నారు. 

అయితే సినిమా థియేటర్లు మాత్రం ఆగస్ట్‌లోనే స్టార్ట్ అవుతాయట. అది కూడా రోజుకు మూడు ఆటలు, సగం సీట్లు అంటూ ఆంక్షలు వుంటాయట. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ షోలే వున్నా కానీ షోల మధ్య గ్యాప్ ఎక్కువ వుండేలా, ప్రతి ఆట ముగిసిన తర్వాత శానిటైజింగ్ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళిక వేసుకున్నారట. 

ప్రేక్షకులు సినిమాలకు ఏ స్థాయిలో వస్తున్నారనే దానిపై పెద్ద బడ్జెట్ సినిమాలు ఆగస్ట్‌లోనే విడుదల చేయాలా లేక దసరా వరకు ఆగాలా అనేది డిసైడ్ అవుతారు. చిన్న నిర్మాతలు పలువురు ఓటీటీల్లో తమ సినిమాలు విడుదల చేసుకుంటామని నిర్మాతల మండలికి విన్నవించుకోగా వారి నుంచి సానుకూల స్పందనే వచ్చినట్టు తెలిసింది. బహుశా జులై నుంచి తెలుగు సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి.