మోడీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌ల దాడి

కేంద్రంలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీ కంటే మోడీ స‌ర్కార్ ఘోర త‌ప్పిదాలు చేస్తోంద‌ని చేవెళ్ల లోక్‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ రంజిత్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్ లోక్‌స‌భ స‌భ్యుడైన రంజిత్ తాను పార్ల‌మెంట్‌కు ఎన్నికై ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా ప్ర‌గ‌తి నివేద‌న కార్య‌క్ర‌మంతో మీడియా ముందుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ప్రధాని నరేంద్ర మోదీ  ప్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని, కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో మోదీ సర్కార్‌ తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

బీజేపీ ప్రభుత్వ తప్పుల‌ను రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎండ‌గ‌డుతామ‌న్నారు. గుజ‌రాత్ సీఎంగా మోడీ ప‌నిచేసేట‌ప్పుడు సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వం కావాలన్న విష‌యాన్ని గుర్తు చేశారు.  ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్య ఉపాధి కల్పించలేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారని ప్ర‌శ్నించారు.

వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం లేకుండా లాక్‌డౌన్ విధించార‌ని విమ‌ర్శించారు. వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ప్రధాని తీయని మాటలు చెప్తారే తప్ప ఏ పనులు  చేయడం లేద‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు.

కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారన్నారు. హెలికాప్టర్ మినీ అని సీఎం కేసీఆర్‌ చెబితే కనీసం పట్టించుకోలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారన్నారు.  

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

అపూర్వ ఘట్టానికి సంవత్సరం