టాలీవుడ్ పెద్దలకు కేసిఆర్ షాక్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్వవహారశైలి భలే చిత్రంగా వుంటుంది. ముక్కుసూటిగా వున్నట్లు వుంటుంది. ఎదుటివారిని గుచ్చినట్లు వుంటుంది. కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. నిన్నటికి నిన్న టాలీవుడ్ పెద్దలు కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కూడా ఇలాంటి ఫన్ మూవ్ మెంట్స్ నే ఎదురయినట్లు తెలుస్తోంది.

షూటింగ్ లకు అనుమతి కోరగా....' చేసుకోండి...దాదాపు అన్నీ వదిలేసాం కదా..యాభై మంది వంద మందితో చేసుకోవచ్చు..మరీ రెండు వందల మంది అంటే ఆలోచిద్దాం...' అని చెప్పి చిన్న పాటి షాక్ ఇచ్చారట.

అక్కడితో ఆగకుండా..

''..ఇప్పుడు ఈ గదిలో ఎంత మంది వున్నాం..నలభై యాభై మంది వున్నామా? మనలో కనీసం సగానికి పైగా మందికి కరోనా పాజిటివ్ వుండే అవకాశం వుంది..కావాలంటే టెస్ట్ చేయిద్దామా..' అనే సరికి టాలీవుడ్ జనాలు బిత్తరపోయారని, ఆఫై నవ్వులు రువ్వారని బోగట్టా. ఇక అందరం కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కేసిఆర్ ముక్తాయించారట. 

రాజమౌళి, కొరటాల శివ మాక్ షూట్ లు చేసి, ఎలా సెఫ్టీ మెజర్స్, తక్కువ మందితో షూట్ చేయాలో డెమో చేస్తారని వివరించగా, 'ఏమీ అక్కరలేదు..మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. ఇంతకీ మీ హీరోలు వస్తారా' అని కేసిఆర్ మరో చెణుకు విసిరారని తెలుస్తోంది. మొత్తం మీద టాలీవుడ్ పెద్దలు కేసిఆర్ తమను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వెళ్తే, ఫుల్ ఫన్ అండ్ జోష్ తో తిరిగి వచ్చినట్లు అయింది.

అపూర్వ ఘట్టానికి సంవత్సరం