భార‌తీయ బాలిక సాహసానికి అమెరికా బ్యూటీ ఫిదా

భార‌తీయ బాలిక జ్యోతి సాహ‌సానికి అమెరికా బ్యూటీ ఫిదా అయింది. లాక్‌డౌన్‌లో హ‌ర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దుర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చో పెట్టుకుని 1200  ప్ర‌యాణించిన 15 ఏళ్ల జ్యోతి గురించి తెలుసుకున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌ల‌హాదారు, ఆయ‌న కూతురైన ఇవాంక ట్రంప్ ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందానికి లోన‌య్యారు. జ్యోతిపై ఆమె ప్ర‌శంస‌లు కురిపించారు.

జ్యోతికుమారి చేసిన సాహ‌స్యం అద్భుత‌మ‌ని ట్విట‌ర్‌లో ఆమె కొనియాడారు. ఈ నెల 10న గురుగ్రాం నుంచి సైకిల్‌పై తండ్రితో క‌లిసి మొద‌లైన ప్ర‌యాణం 16వ తేదీకి స్వ‌గ్రామం ద‌ర్భంగాకు చేరింది. మొత్తం 1200 కిలోమీట‌ర్లు తండ్రిని సైకిల్‌పై కూచో పెట్టుకుని ఆ బాలిక సాహస యాత్ర చేసి యావ‌త్ దేశాన్ని, ప్ర‌పంచ దృష్టిని త‌న వైపు తిప్పుకునేలా చేసింది.

ఈ నేప‌థ్యంలో ఇవాంక ట్రంప్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ' 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజల్లో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను ఆకర్షించింది'  అంటూ ట్వీట్‌ చేశారు.

సైకిల్‌పై జ్యోతి సాహ‌స యాత్ర మ‌న దేశ శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేశాయి. ఆ విష‌యం ఇవాంక ట్వీట్ ద్వారా తెలిసి వ‌చ్చింది. 

అపూర్వ ఘట్టానికి సంవత్సరం

Show comments