వివాదంలో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నేతృత్వంలో తెర‌కెక్కిన వెబ్ సిరీస్‌లోని ఓ మ‌హిళ పాత్ర జాత్యంహ‌కారాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఓ వ‌ర్గం తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. అనుష్మ శ‌ర్మ‌పై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

అనుష్క శ‌ర్మ నిర్మాణంలో పాట‌ల్ లోక్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌ల విడుద‌లైంది. దీంతో స‌మ‌స్య తలెత్తింది. గూర్ఖా క‌మ్యూనిటీ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఈ వెబ్ సిరీస్ ఉంద‌నే వాద‌న బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో గూర్ఖా కమ్యూనిటీ గ్రూప్ అనుష్కపై ఆగ్ర‌హంగా ఉంది. వెబ్ సిరీస్‌లో సమాజానికి వ్యతిరేకంగా  "సెక్సిస్ట్ స్లర్" ఆరోపణలున్నాయ‌ని వారి వాద‌న‌. ఈ నేప‌థ్యంలో ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ ఈ నెల‌ 18 న ఆన్‌లైన్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) కు ఫిర్యాదు చేసింది.

అంతటితో ఆగ‌లేదు. భారతీయ గూర్ఖా పరిసంఘ్  యువజన విభాగం అయిన భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్ (భాగోయూప్) కూడా ఆ దృశ్యాన్ని తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. ఒక మహిళ పాత్రకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వాడార‌ని , ఆమె పేరు మేఘాలయలోని ఖాసీ వర్గానికి చెందింద‌ని వెల్ల‌డించారు. వెబ్ సిరీస్  రెండవ ఎపిసోడ్‌లోని క్లిప్ సమాజానికి వ్యతిరే కంగా జాత్యహంకారాన్ని చూపిస్తుంద‌ని గూర్ఖా సమూహాలు చెబుతున్నాయి.

దీనిపై అనుష్క శ‌ర్మ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేదు. కానీ ఆమె స్పందిస్తే త‌ప్ప స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా లేదు. చూద్దాం ఆ అందాల తార స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మిస్తుందో!

అపూర్వ ఘట్టానికి సంవత్సరం

Show comments