తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బతకాల్సిందే అని వ్యాఖ్యానించారు ఎంపీ నందిగం సురేష్. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని, ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు ఇక గెలవలేరని.. అందుకే తన క్రిమినల్ మైండ్ సెట్ తో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై సురేష్ ఈ విధంగా స్పందించారు.
సుధాకర్ అనే డాక్టర్ విషయంలో సీబీఐ విచారణను ఈ ఎంపీ స్వాగతించారు. ఆ విచారణలో అయినా అసలు విషయం బయటపడుతుందని అన్నారు. దళిత కార్డును పట్టుకున్నంత మాత్రాన సుధాకర్ చేసిన పనులు ఒప్పులైపోవని, ఆయన మాటలను సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారని సురేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నారని అన్నారు.
తన కుటిల వ్యూహాలతో చంద్రబాబు నాయుడు అనేక మందిని బలి చేస్తూ ఉంటారని, అలాంటి వారిలో సుధాకర్ కూడా ఒకరని సురేష్ అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ తరహా కుట్రలు కూడా ఎల్లకాలమూ సాగవని, వీటికి చెక్ పడే సమయం ఉందని ఈ ఎంపీ అన్నారు.
ఇక డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ చర్చనీయాంశంగా మారింది. తాగి అడ్డగోలుగా వాగిన వ్యక్తి విషయంలో సీబీఐ ఏం విచారణ చేస్తుందో అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు.