ఏపీలో 2500 దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 2500 మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో 8415 శాంపిల్స్ ను పరీక్షించగా.. వీళ్లలో 62 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2514కు చేరుకుంది.

తాజాగా నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడుకు చెందిన కేసులు 18 ఉన్నాయి. వీళ్లలో నెల్లూరు నుంచి 14 మంది, చిత్తూరు నుంచి నలుగురు ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 55కు చేరింది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. నిన్న ఒక్క రోజే 51 మంది కరోనాతో కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 1731కు చేరింది. ప్రస్తుతం 728 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని పంపించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 60వేల మందికి పైగా వ్యక్తుల్ని రైళ్లు, బస్సుల ద్వారా వాళ్ల రాష్ట్రాలకు తరలించారు. వీళ్లలో వలస కార్మికులు 57వేల మందికి పైగా ఉండగా.. యాత్రికులు, విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఉన్నారు.

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

Show comments