స్టన్ అయిన మారుతి

టచ్ చేయకుండానే పిల్లాడు పుట్టేస్తున్నాడు అని తెలిస్తే కాస్త కంగారే. హీరోను కలవలేదు. కథ చెప్పలేదు. అసలు కథే రెడీ చేయలేదు. కానీ ఫలానా హీరోతో ఫలానా డైరక్టర్ సినిమా అని వస్తే అలాగే వుంటుంది. డైరక్టర్ మారుతి కూడా ఇప్పుడు అలాగే కంగారుపడ్డారు. 

ఉన్నట్లుండి వెబ్ మీడియాలో బన్నీతో మారుతి సినిమా అంటూ వార్తలు వచ్చాయి. బన్నీ తో సినిమా చేయాలని అందరికీ వుంటుంది. కానీ ప్రస్తుతం బన్నీ బిజీగా వున్నారు. మారుతి ఆ ఆలోచనలోనే  లేరు. తను వేరే కథ రాసుకుంటూ, దాన్ని ఓ యంగ్ హీరోకి చెప్పడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

త్రివిక్రమ్ తరువాత సుకుమార్, సురేందర్ రెడ్డి, ఆపై మళ్లీ త్రివిక్రమ్ ఇలా వుంది బన్నీ లైనప్. ఇలాంటి టైమ్ లో బన్నీ తో మారుతి సినిమా అని వచ్చేసరికి సాక్షాత్తూ మారుతే ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఆయనను సంప్రదిస్తే, బన్నీతో సినిమా చేయాలని అందరికీ వుంటుందని, అయితే ప్రస్తుతం తను ఇంకా కథే రెడీ చేయలేదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదని అన్నారు. 

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

Show comments