డిస్ట్రిబ్యూటర్ ఫోన్ ఎత్తని నిర్మాత

అవసరం తీరిపోయాక ఓడ మల్లన్న కాస్తా బోడిమల్లన్న అవుతాడు. చాలా మంది సినిమా జనాల వ్యవహారం కూడా ఇలాగే వుంటుంది. ఆ మధ్య ఆరు నెలల క్రితం ఓ సీనియర్ హీరో సినిమా వచ్చింది. ఆంధ్రలోని ఓ ఏరియాకు కొనేవారు లేరు. దాంతో నిర్మాత ఓ బయ్యర్ ను పట్టుకుని, 'నీ హ్యాండ్ మంచింది, నువ్వు డబ్బులు పంపు' అంటూ తెగ బతిమాలారు. దాంతో ఆ బయ్యర్ కాస్త ముందు వెనుకలాడి రెండు కోట్లకు పైగానే మొత్తాన్ని సర్దుబాటు చేసినట్లు బోగట్టా. 

అయితే మూడు కోట్లు అయినా ఇవ్వమని అడిగారు. అంత ఇవ్వలేనన్నారు. రెండు కోట్లకు పైగా ఇచ్చారు.  అగ్రమెంట్ లో రిటర్న్ బుల్ అడ్వాన్స్ గానే రాసుకున్నారు తప్ప, అవుట్ రేట్ అనో, ఎన్ ఆర్ ఎ అనో రాసుకోలేదు. అలా అయితే తనకు వద్దని డిస్ట్రిబ్యూటర్ ముందే చెప్పేసాడు. ఎందుకుంటే ఆ సినిమా మీద నమ్మకాలు అంతంత మాత్రం కనుక.

ఆఖరికి సినిమా విడుదలయింది. ముందుగా చాలా మంది ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది.  ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ రెండు కోట్ల పై చిలుకు మొత్తం ఇరుక్కుపోయింది. నిర్మాత ఫోన్ కు దొరకడం లేదు. కబురుకు అందడం లేదు. ఏం చేయాలో? ఎవరి చేత చెప్పించాలో తెలియక డిస్ట్రిబ్యూటర్ తలపట్టుకుంటున్నాడు. 

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం