డాక్ట‌ర్ సుధాక‌ర్‌కో న్యాయం...ఆర్‌కేకో న్యాయ‌మా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌జ్యోతి  ఎండీ వేమూరి రాధాకృష్ణ అత్యంత స‌న్నిహితులు. ఇది ఒక‌ప్ప‌టి మాట అని ఇంత కాలం అంద‌రూ అనుకుంటూ వ‌చ్చారు. క‌రోనాపై త‌ప్పుడు క‌థ‌నం రాశార‌ని ఆర్‌కే తాట తీస్తాన‌ని కేసీఆర్ హెచ్చ‌రిస్తే.... నిజ‌మే న‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు భ‌మించారు. ఇదంతా ఉత్తుత్తిదేన‌ని కాలం అంటోంది. ఆర్‌కేపై కేసీఆర్ క‌న‌బ‌రుస్తున్న వ‌ల్ల మాలిన ప్రేమ‌కు నిద‌ర్శ‌నం ఏంటో చివ‌ర్లో చెప్పుకుందాం.

య‌ధావిధిగా ఈ ఆదివారం ఆర్‌కే క‌లం నుంచి మ‌రో ఆణిముత్యం వెలువ‌డింది. ‘జ‌ల‌పాఠాలు’ శీర్షిక‌తో ఆర్‌కే ‘కొత్త ప‌లుకు’ రాశారు. ఎందుకో శీర్షిక అతికిన‌ట్టు లేదు. ‘జ‌ల జ‌గ‌డాలు’ అని పెట్టి ఉంటే జ‌గ‌న్ పేరు కూడా క‌లిసి వ‌చ్చేది. పోనీలే శీర్షిక‌లో ఏముంది...క‌థ‌నంలో క‌దా అస‌లు సంగ‌తి ఉండేది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా వార్తా ప‌త్రిక‌లు, చాన‌ళ్లు పాత సంగ‌తులన్నీ పాఠ‌కులు, ప్రేక్ష‌కుల‌కు గుర్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్‌కే కొత్త ప‌లుకు కూడా ఆ ఫీలింగ్‌నే క‌లిగిస్తోంది.

‘ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని అప్రతిష్ఠపాల్జేయడానికై జగన్‌ పకడ్బందీ వ్యూహరచన చేసుకు న్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను గరిష్ఠంగా వాడుకు న్నారు. అవాస్తవాల ప్రచార హోరులో నిజం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితిలోకి ప్రజలను నెట్టారు’ ...అని ఆర్‌కే రాసుకొచ్చారు.

అస‌లు మీడియా మేనేజ్మెంట్‌లో చంద్ర‌బాబుకు మించిన దిట్ట మ‌రొక‌రు లేర‌ని లోక‌మంతా కోడై కూస్తుంది. ఏపీలో చంద్ర‌బాబుకు అనుకూలంగా ప్ర‌ధాన ప‌త్రిక‌లైన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతితో పాటు ఏబీఎన్‌, టీవీ9 (అప్ప‌ట్లో బాగా బాకా ఊదేది), టీవీ5, ఏపీ 24, ఈటీవీ, మ‌హాటీవీ, టీడీపీ సోష‌ల్ మీడియా క‌లిసి జ‌గ‌న్‌పై విష ప్ర‌చారం చేసిన విష‌యాన్ని ఆర్‌కే మ‌రిచిన‌ట్టున్నారు. పెద్ద ఎల్లో సైన్యం, ఆధునిక అస్త్ర‌శ‌స్త్రాలు క‌లిగిన చంద్ర‌బాబు, ఆయ‌నకు జాకీలు పెట్టి లేపే ఎల్లో మీడియా దుష్ప్ర‌చారం సోష‌ల్ మీడియా ముందు ఎందుకూ ప‌నికి రాద‌ని ఆర్‌కే చెప్ప‌ద‌ల‌చుకున్నారా? జ‌గ‌న్ విజ‌యం అంటే ఆయ‌న ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న బాబు, ఆయ న ఎల్లో మీడియా అప‌జ‌య‌మ‌నే క‌దా అర్థం.  అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో డాక్ట‌రేట్ అందుకున్న ఎల్లో మీడియా... పాపం సోష‌ల్ మీడియా దెబ్బ‌కు చిగురుటాకుల్లా వ‌ణికిపోతోంది. సోష‌ల్ మీడియాలో ఘోర ప‌రాభ‌వాన్ని చ‌వి చూసిన‌, చూస్తు న్న ఆర్‌కే తీవ్ర ప్ర‌స్ట్రేష‌న్‌ల్ ఉన్నార‌నేందుకు ఈ కొత్త ప‌లుకే నిద‌ర్శ‌నం.

స‌మాజంలో గౌర‌వం క‌లిగిన అజ‌య్‌క‌ల్లం, జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, జ‌న‌చైత‌న్య వేదిక ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి త‌దిత‌ర ప్ర‌ము ఖుల‌తో  పాటు  మరెందరో స్లీపర్‌ సెల్స్‌గా వ్యవహరించి చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేసి పెట్టారని ఆర్‌కే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరిలో కొందరు కులాభిమానంతో, మరికొందరు చంద్రబాబుపై వ్యతిరేకతతో జగన్మోహన్‌రెడ్డితో చేతులు కలిపారని, వీటన్నింటికి తోడు ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ చేయని దుష్ప్రచారం లేదని ఆర్‌కే రాసుకొచ్చారు. అడుగ‌డుగునా ఆర్‌కే మీడియాగా తాము విఫ‌ల‌మ య్యామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

జ‌గ‌న్ టీం అలా చేసింది, ఇలా చేసింది అని ఏడ్చే బ‌దులు...బాబు న‌మ్ముకున్న ఆర్‌కే, రామోజీ, ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు ఏం చేశాయో చెప్పాలి క‌దా? ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఎప్పుడైనా ఆత్మ విమ‌ర్శ చేసుకున్నారా? అబ్బే...ఆత్మ స్తుతి, ప‌ర‌నిందే. ఈ ఆర్టిక‌ల్‌లో ఆ ల‌క్ష‌ణాలు మ‌రోసారి క‌నిపించాయి.

‘1999 ఎన్నిక‌ల ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబునాయుడు త‌న ఇమేజ్‌ను పెంచుకోడానికి త‌ట‌స్థులు, మేధావుల‌ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.  దీనివల్ల ప్రజలలో ఆయనపై సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఈ ఎత్తుగడను జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో మార్పులు చేసి నాటి ముఖ్యమంత్రిపై వ్యతిరేక ప్రచారానికి మేధావులను వాడుకున్నారు’...అని ఆర్‌కే రాసిన ఈ వాక్యాల‌ను చ‌దివి న‌వ్వుకోవ‌ద్దు. న‌వ్వితే త‌ల ప‌గిలిపోతుంది జాగ్ర‌త్త‌.  

‘ప్రజలకు అంత జ్ఞాపక శక్తి, అవగాహన ఉండదు కనుక ‘పేదలు’ అన్న పదాన్ని స్మరిస్తూ ఓటుబ్యాంకును కాపాడుకోవడానికై జగన్‌ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజాలు మాట్లాడినా కేసులలో ఇరి కించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో నోరుండి, మెదడు చురుగ్గా ఉన్నవాళ్లు కూడా తమ నోళ్లకు తాళం వేసుకున్నారు’

అవున‌వును ఆర్‌కే నిజాలు ఎంత బాగా రాశారో క‌దా! బాబు పాల‌న‌లో నిజాలు మాట్లాడే వాళ్ల‌కు ఘ‌న స‌న్మానం చేసేవాళ్లు. విజ‌య‌వాడ పుర‌వీధుల్లో ఏనుగుల‌పై ఊరేగించేవాళ్లు. అస‌లు పోలీస్‌స్టేష‌న్లే ఎత్తి వేయాల‌నే ఆలోచ‌న కూడా చంద్ర‌బాబు చేసిన ట్టున్నారు.

పోతిరెడ్డిపాడుతో రాయ‌ల‌సీమ‌కు ఒరిగేదేమీ లేద‌ని ఆర్‌కే రాసిన త‌ర్వాత ఆయ‌న మాన‌సిక స్థితిపై అనుమానాలు పెరుగుతు న్నాయి. పాత విష‌యాల‌న్నీ మ‌ళ్లీ ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌పై త‌న ఉక్రోశాన్ని వెళ్ల‌గ‌క్క‌డం చూస్తే...ఆయ‌న‌లో ఎక్క‌డో మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పుతున్న‌ట్టుంది. స‌హ‌జంగానే మ‌నిషి ఆవేశంలో వివేకాన్ని కోల్పోతార‌ని అంటారు.

ఏపీ స‌ర్కార్‌పై అవాకులు చెవాకులు పేలి స‌స్పెండ్ అయిన న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్ శ‌నివారం విశాఖ‌లో అర్ధ‌న‌గ్నంగా హ‌ల్‌చ‌ల్ చేశాడు. దీంతో పోలీసులు అత‌న్ని పెద‌వాల్తేరులోని ప్ర‌భుత్వ మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.  డాక్ట‌ర్ సుధాకర్‌ ‘ఎక్యూ ట్‌ అండ్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్‌’ అనే మానసిక రుగ్మతతో బాధ పడుతున్నట్టు  డాక్టర్‌ రాధారాణి వెల్లడించారు.

మ‌రి కొన్నేళ్లుగా ఆర్‌కే దిగంబ‌రంగా జ‌గ‌న్‌పై ఇష్టానుసారం అవాకులు చెవాకులు పేలుతున్నాడు. హైద‌రాబాద్ కేంద్రంగా ఉంటూ జ‌గ‌న్‌పై, ఏపీపై కారు కూత‌లు కూస్తున్న ఆర్‌కే మాన‌సిక స్థితిని ఎందుకు ప‌రీక్షించ‌డం లేదు?  డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను విశాఖ‌లో మానిస‌క వైద్య‌శాల‌కు త‌ర‌లించిన‌ట్టు, తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్‌కేను ఎర్ర‌గ‌డ్డ మానసిక ఆస్ప‌త్రికి ఎందుకు తీసుకెళ్ల‌డం లేదు?  దీనికి స‌మాధానం మొద‌ట్లో చెప్పిన‌ట్టు...కేసీఆర్‌తో ఉన్న స్నేహ బంధం వ‌ల్లే ఆర్‌కేను అలా దిగంబ‌రంగా లోకంపై విడిచి పెట్టార‌ని అర్థం చేసుకోవాలి. ‘ఎక్యూ ట్‌ అండ్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్‌’ అనే మానసిక రుగ్మత ఆర్‌కేకు కూడా ఉందా?  డాక్ట‌ర్ సుధాకర్‌కో న్యాయం, ఆర్‌కేకు మ‌రో న్యాయ‌మా? ఇదెక్క‌డి న్యాయం కేసీఆర్‌?

-సొదుం

మ‌డ అడ‌వుల అస‌లు చ‌రిత్ర‌

Show comments