అనుష్కా షెట్టి కుటుంబానికి ఆ డాన్ స‌న్నిహితుడా?

ద‌శాబ్దాల పాటు క‌ర్ణాట‌క‌లో డాన్ గా ముత్త‌ప్పా రై పేరు మార్మోగింది. ఆయ‌న ప్ర‌స్థానం నిన్న‌టితో ముగిసింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయ‌న నిన్న తుదిశ్వాస విడిచారు. రై జీవితం స‌ర్వ‌త్రా ఆస‌క్తిదాయ‌కంగా నిలుస్తూ వ‌చ్చింది. ఒక ద‌శ‌లో రామ్ గోపాల్ వ‌ర్మ ఆయ‌న జీవితం మీద సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించాడు కూడా. అయితే అది కుద‌ర‌లేదు. కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాను తీసిన రోజుల్లో రామూ క‌ర్ణాట‌క‌లో గ‌డిపి, అక్క‌డ రై గురించి తెలుసుకుని సినిమాను ప్ర‌క‌టించిన‌ట్టున్నాడు. ఆ త‌ర్వాత వ‌ర్మ సినిమాల్లో కొన్ని టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే ఆగిపోయిన‌ట్టుగా అది కూడా ఆగిపోయింది. మ‌రి ఇప్పుడేమైనా ఆర్జీవీ ఆ సినిమా గురించి స్పందిస్తాడేమో!

ఆ సంగ‌త‌లా ఉంటే.. రై తో క‌ర్ణాట‌క‌కు సంబంధించిన ప్ర‌ముఖులు స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉంటార‌నే ప్ర‌చారం ఒక‌టి ఉంది. ఒక‌ప్పుడు దావూద్ ఇబ్ర‌హీంతో బాలీవుడ్ ప్ర‌ముఖులు స‌త్సంబంధాలు క‌లిగిన రీతిలో రై తో కూడా క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని అంటారు. గ‌తంలో దావూద్ తో బాలీవుడ్ ప్ర‌ముఖులు దిగిన ఫొటోలు కూడా నెట్లో క‌నిపిస్తాయి. 

ఆ సంగ‌త‌లా ఉంటే.. ముత్త‌ప్పా రై ఒక ద‌శ‌లో డాన్ అయినా, ఆ త‌ర్వాత ఆ ట్యాగ్ తొల‌గించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గ‌నైజేష‌న్ పెట్టి ఆయ‌న సంఘ సేవ చేసుకున్నాడంటారు. అయితే ఒక్క‌సారి డాన్ అనే పేరు వ‌చ్చాకా సెటిల్ మెంట్లు వాళ్ల‌ను వెదుక్కొంటూనే వ‌స్తుంటాయి!

ఇక ఫ్యామిలీ సంబంధాల విష‌యానికి వ‌స్తే.. క‌ర్ణాట‌క ప్ర‌ముఖులు కొంద‌రికి ముత్త‌ప్ప రైతో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నేది చంద‌న‌సీమ‌లో జ‌రిగే ప్ర‌చారం. తెలుగులో స్టార్ అయిన అనుష్కా షెట్టి కుటుంబానికి కూడా రై ద‌గ్గ‌ర‌ని వాడ‌ని క‌న్న‌డీగులు అంటారు. అనుష్క సోద‌రుల‌కు, రైకి స‌న్నిహిత సంబంధాలుండేవని క‌ర్ణాట‌క జ‌నాలు అంటారు. ప్రముఖ స్థాయికి ఎదిగిన నేప‌థ్యంలో అలాంటి బంధాలు, సాన్నిహిత్యాలు ఏర్ప‌డే రీతిన వీరంతా ఫ్రెండ్స్ అని అక్క‌డి టాక్. రై కూడా క‌ర్ణాట‌క తీర ప్రాంతానికి చెందిన వాడే, షెట్టిలు కూడా మంగ‌ళూరు ఏరియా వాళ్లే. ఆ త‌ర‌హా బంధం కూడా వీరి స్నేహానికి కార‌ణం కావొచ్చు.

చిన్న పిల్లాడిలా మహేష్ బాబు అల్లరి