ఏ క్షణమైనా త్రివిక్రమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారన్నపుడే త్రివిక్రమ్ తో సినిమా అన్నది వార్తల్లోకి వచ్చింది. కానీ చిత్రంగా త్రివిక్రమ్ తో సంబంధం లేకుండానే పవన్ రెండు సినిమాలు చకచకా ప్లాన్ చేసారు. మరో సినిమా కూడా పైప్ లైన్ లో వుంది. త్రివిక్రమ్ ఓ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు.

కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్రివిక్రమ్ రెడీ అని అంటే ఏ సినిమా మీద వున్నా, దాన్ని ఆపేసి మరీ  సినిమా చేయడానికి పవన్ రెడీ అని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తో చేసే సినిమా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అదే విధంగా పవన్-క్రిష్ సినిమా కూడా.

ఈ రెండూ కనుక ఒకేసారి ఫినిష్ అయితే అప్పుడు పవన్-తివిక్రమ్ కాంబినేషన్ వుండే అవకాశం వుంది. ఇందుకోసం ఓ సబ్జెక్ట్ కూడా రెడీగా వుందని తెలుస్తోంది. ఈసారి కనుక పవన్-తివిక్రమ్ కాంబినేషన్ అంటూ సినిమా వస్తే అది కచ్చితంగా సక్సెస్ ఫుల్ మూవీ కావాల్సిందే. అజ్ఞాతవాసి మరకను తుడిచిపెట్టాల్సిందే.

జగన్ ట్రాప్ లో బాబు పడ్డాడా?