బన్నీ లుక్ వచ్చేస్తోంది

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తయారు కాబోయే సినిమా శేషాచలం. నిజానికి ఇది టైటిల్ అని వినిపిస్తున్న మాట నిజమే కానీ,  ఇదే టైటిల్ అన్నది ఖరారు కాలేదు. ఇది కాదు అని కూడా వార్తలు వున్నాయి. ఏమైతేనేం ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ, బన్నీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రాబోతోంది.

ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీస్ సంస్థ ఈ రాత్రికి ప్రకటించబోతోంది. ఓ న్యూస్ వెల్లడించబోతున్నట్లుగా ట్విట్టర్ లో వెల్లడించారు. అది బన్నీ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ తప్ప వేరు కాదు. అయితే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారా? ప్రకటించరా? అన్నది తెలియాల్సి వుంది. ప్రకటించే అవకాశాలే ఎక్కువ వున్నాయి.

వాస్తవానికి బన్నీ-సుకుమార్ సినిమా స్టార్ట్ కాలేదు. అయితే బన్నీ గెటప్ మీద టెస్ట్ షూట్ చేసారు. అందులో ఫైనల్ అయిన దాన్నే ఫస్ట్ లుక్ గా విడుదల చేయబోతున్నారని బోగట్టా. 

పారిశుధ్య కార్మికురాలి కాళ్ళు క‌డిగిన వైసీపీ ఎమ్మెల్యే

Show comments